PM Modi : సాధార‌ణ కుటుంబాలు అసాధార‌ణ విజ‌యాలు

క్రీడాకారుల ప్ర‌తిభ అద్భుతమ‌న్న ప్ర‌ధాని మోదీ

PM Modi : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సాధార‌ణ కుటుంబాల నుంచి వ‌చ్చిన క్రీడాకారులు అద్భుత విజ‌యాలు సాధించారంటూ కొనియాడారు. ఆదివారం మ‌న్ కీ బాత్ సంద‌ర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు మోదీ.

అంతే కాకుండా భార‌త దేశంలో ఆట‌గాళ్ల గురించి, వారు ప్ర‌ద‌ర్శించిన ప్ర‌తిభా పాట‌వాల గురించి తెలియ చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లోనూ మ‌న ఆట‌గాళ్లు ఎన్నో రికార్డులు సాధించార‌ని చెప్పారు ప్ర‌ధాన మంత్రి.

ఈ గేమ్ ల‌లో మొత్తం 12 రికార్డులు బ‌ద్ద‌లు అయ్యాయ‌ని తెలిపారు. వాటిలో 11 రికార్డులు మ‌హిళా క్రీడాకారుల పేర్ల‌పై న‌మోద‌య్యాయ‌ని న‌రేంద్ర మోదీ(PM Modi) చెప్పారు.

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో మ‌రో ప్ర‌త్యేక‌త ఉంద‌న్నారు. ఈసారి కూడా చాలా సాధార‌ణ కుటుంబాల నుండి వ‌చ్చిన ప్ర‌తిభావంత‌లు బ‌య‌ట ప‌డ్డార‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ ఆట‌గాళ్లు త‌మ జీవితంలో చాలా క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చార‌ని, ఈ అత్యున్న‌త స్థాయికి చేరుకున్నార‌ని కితాబు ఇచ్చారు. ఈ క్రీడాకారుంతా ఉన్న‌త స్థాయి కుటుంబాల నుంచి రాలేద‌న్నారు.

విజ‌యం సాధించాలంటే క‌ష్ట‌ప‌డి పైకి రావ‌చ్చ‌ని వీరంతా మ‌న‌కు నిరూపించార‌ని చెప్పారు న‌రేంద్ర మోదీ. ఒలింపిక్ గ‌దోల్డ్ మెడ‌లిస్ట్ నీర‌జ్ చోప్రా ఫిన్ లాండ్ లోని నుర్మి గేమ్స్ లో స్వ‌ర్ణం గెలుచుకున్నార‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా నీర‌జ్ చోప్రాను అభినందిస్తున్న‌ట్లు చెప్పారు ప్ర‌ధాన మంత్రి. కేంద్ర ప్ర‌భుత్వం క్రీడ‌ల అభివృద్ధికి కృషి చేస్తోంద‌ని చెప్పారు.

Also Read : కేంద్ర మంత్రి షెకావ‌త్ పై సీఎం ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!