Mekapati Vikram Reddy : మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి ఘ‌న విజ‌యం

82,888 ఓట్ల తేడాతో ఘ‌న విజ‌యం

Mekapati Vikram Reddy : ఏపీలోని ఆత్మ‌కూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ అభ్య‌ర్థి మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి ఘ‌న విజ‌యం సాధించారు.

పూర్తిగా ఈ ఎన్నిక ఏక‌ప‌క్షంగా సాగింది. విక్ర‌మ్ రెడ్డి ఏకంగా 82, 888 ఓట్ల భారీ తేడాతో విజ‌య ఢంకా మోగించారు. టీడీపీ స‌పోర్ట్ తో బ‌రిలోకి దిగిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన భ‌ర‌త్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు.

ఇక ఉప ఎన్నిక విష‌యానికి వ‌స్తే వైసీపీ అభ్య‌ర్థి మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డికి(Mekapati Vikram Reddy) మొత్తం 1,02,240 ఓట్లు వ‌చ్చాయి. బీజేపీ అభ్య‌ర్థి భ‌ర‌త్ కుమార్ కు 19,352 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.

ఓట్ల లెక్కింపు అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య జ‌రిగింది. మొద‌టి రౌండ్ నుంచీ ఆధిక్యంలో వుంటూ వ‌చ్చారు మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి. ఇక పోస్ట‌ల్ బ్యాలెట్ లో 205 ఓట్ల‌కు గాను 167 ఓట్లు రెడ్డికి వ‌చ్చాయి.

బ్యాలెట్ ఓట్ల‌లోనూ వైసీపీకి ఆధిక్యం ల‌భించింది. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర మంత్రివ‌ర్గంలో ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా ఉన్న మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి అకాల మ‌ర‌ణం చెంద‌డంతో ఈ ఉప ఎన్నిక అనివార్య‌మైంది.

ఉప ఎన్నిక‌ల్లో చ‌ని పోయిన ఎమ్మెల్యేలు, ఎంపీల కుటుంబ స‌భ్యుల‌పై త‌మ అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టబోమంటూ ఇప్ప‌టికే టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు.

మ‌ర‌ణించిన గౌత‌మ్ రెడ్డి స్థానంలో ఆయ‌న సోద‌రుడు మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డిని బ‌రిలోకి దింపింది వైసీపీ. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ బీజేపీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

Also Read : ఆర్జీవీ నిర్వాకం మ‌హిళా క‌మిష‌న్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!