Eoin Morgan : క్రికెట్ కు గుడ్ బై చెప్ప‌నున్న మోర్గాన్

కోడై కూస్తున్న ఇంగ్లండ్ మీడియా

Eoin Morgan : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ , ప్ర‌పంచ క‌ప్ విజేత‌గా నిలిపిన టాప్ స్టార్ క్రికెట‌ర్ ఇయాన్ మోర్గాన్(Ion Morgan)  క్రికెట్ కు గుడ్ బై చెప్ప‌నున్న‌ట్లు స‌మాచారం. ఇదే విష‌యాన్ని ఇంగ్లండ్ మీడియా కోడై కూస్తోంది. ఐర్లాండ్ తో త‌న అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్ ను ప్రారంభించాడు.

ఇంగ్లండ్ త‌ర‌పున 225 వ‌న్డేలు , 115 టి20లు ఆడాడు. ఇంగ్లాండ్ వైట్ బాల్ క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యంత అద్భుత‌మైన విజ‌యాల‌ను అందించ‌న వాడిగా ఇయాన్ మోర్గాన్ చ‌రిత్ర సృష్టించాడు.

బీబీసీ అంచ‌నా మేర‌కు మంగ‌ళ‌వారం త‌ను ప్ర‌క‌ట‌న చేయ‌వ‌చ్చ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 2019లో జ‌రిగిన 50 ఓవ‌ర్ల ప్ర‌పంచ క‌ప్ మోర్గాన్ సార‌థ్యంలోనే ఇంగ్లండ్ చేజిక్కించుకుంది.

ఇయాన్ మోర్గాన్(Eoin Morgan) ప్ర‌తిభావంతులైన యువ ఆట‌గాళ్ల‌ను ప్రోత్స‌హించాడు. వారిని త‌యారు చేయడంలో కీల‌క పాత్ర పోషించాడు. 2016లో ఇండియాలో జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో మోర్గాన్ సార‌థ్యంలోని ఇంగ్లండ్ ఫైన‌ల్ కు చేరుకుంది.

ఇయాన్ మోర్గాన్ ఇప్ప‌టి దాకా 248 వ‌న్డేల్లో 39.29 స‌గ‌టుతో 14 సెంచ‌రీలు చేశాడు. 47 హాఫ్ సెంచ‌రీల‌తో 7,701 ర‌న్స్ చేశాడు. మొత్తం 115 టి20ల్లో 2,458 ర‌న్స్ చేశాడు.

ఇయాన్ మోర్గాన్ 16 టెస్టుల్లో 30.43 స‌గ‌టుతో 700 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. మోర్గాన్(EIon Morgan)  పేల‌వ‌మైన ఫామ్ , ఫిట్ నెస్ స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతుండ‌డం కూడా రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌ల నెద‌ర్లాండ్స్ తో జ‌రిగిన చివ‌రి వ‌న్డేలో గాయం కార‌ణంగా త‌ప్పుకున్నాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఇంగ్లండ్ కు ఇప్ప‌టి వ‌ర‌కు విజ‌యాలు ద‌క్కేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

Also Read : గ్రాండ్ మాస్ట‌ర్ తో టార్చ్ బేర‌ర్ చెస్

Leave A Reply

Your Email Id will not be published!