INDW vs SLW 3rd T20 : మూడో టి20లో శ్రీలంక గ్రాండ్ విక్టరీ
లంక కెప్టెన్ చమారి ఆటపట్టు
INDW vs SLW 3rd T20 : నామ మాత్రంగా మూడో టి20 సాగుతుందని అనుకున్న మ్యాచ్ ఉత్కంఠ రేపింది. ప్రధానంగా ఆతిథ్య శ్రీలంక జట్టు కెప్టెన్ చమారి ఆటపట్టు సత్తా చాటింది. మారథాన్ ఇన్నింగ్స్ ఆడింది.
కేవలం 48 బంతులు మాత్రమే ఆడిన ఆటపట్టు 80 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ఇందులో 14 ఫోర్లు ఒక సిక్స్ ఉంది. ఆకాశమే హద్దుగా చెలరేగింది.
భారత మహిళా బౌలర్లకు చుక్కలు చూపించింది. మూడు మ్యాచ్ టీ20 సీరీస్ లో ఇప్పటికే మొదటి, రెండో టి20 మ్యాచ్ లలో భారత మహిళా
జట్లు ఘన విజయం సాధించింది.
కానీ మూడో మ్యాచ్ గెలుపొంది శ్రీలంక(INDW vs SLW 3rd T20) పరువు పోకుండా కాపాడుకుంది. సోమవారం జరిగిన ఈ కీలక మ్యాచ్ లో శ్రీలంక
7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో 2-1 తేడాతో భారత్ సీరీస్ కైవసం చేసుకుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు
కోల్పోయి 138 పరుగులు చేసింది.
అనంతరం 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఇంకా 18 బాల్స్ మిగిలి ఉండగానే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
కెప్టెన్ ఆటపట్టుతో పాటు నిలాక్షి డిసిల్వా సూపర్ ఇన్నింగ్స్ ఆడింది.
28 బంతులు ఆడి 4 ఫోర్లతో 30 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో రాధా యాదవ్ , రేణుక సింగ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక భారత జట్టులో
కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరోసారి సత్తా చాటింది.
39 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. జెమీమా 33 రన్స్ చేసింది. మిగతా ఆటగాళ్లు సరిగా రాణించ లేక పోయారు.
Also Read : క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్న మోర్గాన్