CM KCR T HUB : దేశానికే తలమానికం టీ-హబ్ – కేసీఆర్
రెండో దశ టీ హబ్ ను ప్రారంభించిన సీఎం
CM KCR T HUB : భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన టీ – హబ్ దేశానికే తలమానికమని కొనియాడారు సీఎం కేసీఆర్(CM KCR T HUB). మంగళవారం ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ ఫేజ్ -2 ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అంకురాలను (స్టార్టప్) ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే భారీ ఎత్తున ఖర్చు చేశామన్నారు.
దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ సర్కార్ రూ. 278 కోట్ల ఖర్చుతో ఈ ఇన్నోవేషన్ (ఆవిష్కరణ) సెంటర్ ను రాయదుర్గంలో నిర్మించడం జరిగిందని చెప్పారు సీఎం.
ఇందులో 2,000 కు పైగా అంకురాలను నిర్వహించుకునే వీలు కల్పించడం జరిగిందని వెల్లడించారు. ఈ టీ హబ్(T HUB) మొత్తం 3.14 ఎకరాలలో విస్తరించి ఉందన్నారు.
మొత్తం 10 అంతస్తులున్నాయని మొదటి ఫ్లోర్ ను వెంచర్ క్యాపిటలిస్టుల ఆఫీసులకు కేటాయించడం జరిగిందని తెలిపారు. జూలై 1 నుంచి స్టార్టప్ లు తమ ఆపరేషన్స్ ప్రారంభిస్తాయని తెలిపారు.
సరికొత్త ఆవిష్కరణలతో వచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర అంకురాల పాలసీ కార్పొరేట్ కి ..ఎంటర్ ప్రైన్యూర్ లకు సహాయ పడేలా టీ హబ్ ను రూపొందించడం జరిగిందని కేసీఆర్ చెప్పారు.
అందరూ కలిసి కట్టుగా పని చేస్తూ తెలంగాణకు మంచి పేరు తీసుకు రావాలని కోరారు సీఎం. ఫేజ్ వన్ లో నిర్మించిన టీ హబ్ కంటే రెండో ఫేజ్ మరింత పెద్దదన్నారు కేసీఆర్. ఇది రోల్ మోడల్ గా నిలుస్తుందని ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు.
Also Read : సీజే ప్రమాణం హాజరైన సీఎం
Live: Hon’ble CM Sri KCR at the inauguration event of @THubHyd phase 2 in Hyderabad #InnovateWithTHub https://t.co/LLGddynx4u
— Telangana Digital Media Wing (@DigitalMediaTS) June 28, 2022