Rashmi Thackeray : ఫలించని రశ్మీ ఠాక్రే ప్రయత్నం
కూలి పోయిన మహా వికాస్ అఘాడి ప్రభుత్వం
Rashmi Thackeray : కేంద్రంలో ట్రబుల్ షూటర్ గా అమిత్ షాకు పేరుంది. అదే సమయంలో మరాఠా రాజకీయాలలో సైతం ఆపత్కాలంలో ఆదుకునే నాయకురాలిగా పేరొందారు సీఎంగా పదవి నుంచి తప్పుకున్న ఉద్దవ్ ఠాక్రే సతీమణి రశ్మీ ఠాక్రే(Rashmi Thackeray).
ఉద్దవ్ విజయం వెనుక ఆమె ఉందన్నది వాస్తవం. బీజేపీ నుంచి విడి పోవడానికి కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీతో) శివసేన కలిసేందుకు ప్రధాన కారణం రశ్మీ ఠాక్రే ఉందనేది బహిరంగ రహస్యం.
ఇదిలా ఉండగా ఉన్నట్టుండి ప్రస్తుత ప్రభుత్వంలో శివసేన పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలుపొందిన మంత్రి ఏక్ నాథ్ షిండే సారథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించారు.
వారంతా గుజరాత్ లోని సూరత్ లో బస చేశారు. అక్కడి నుంచి గౌహతి లోని హోటల్ లో మకాం చేశారు. అక్కడి నుంచే రాజకీయం చేశారు.
మంత్రాంగం నడిపారు. రెబల్స్ చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన కార్యకర్తలు ఇళ్లు, ఆఫీసులపై దాడులకు పాల్పడ్డారు. దీంతో మరోసారి రంగంలోకి దిగారు రశ్మీ ఠాక్రే. ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదు.
స్వయంగా రశ్మీ ఠాక్రే తిరుగుబాటు ప్రకటించిన మంత్రి ఏక్ నాథ్ షిండేతో పాటు ఇతర ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లారు. అక్కడ ఎమ్మెల్యేల భార్యలతో మాట్లాడారు.
కలిసి మాట్లాడుకుందాం, తిరిగి శివసేన కుటుంబంలో చేరమని కోరారు. తన భర్త ఉద్దవ్ ఠాక్రేకు మద్దతు ఇవ్వాలని విన్నవించారు. కానీ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూల్చేందుకే సిద్ద పడింది.
ఆ మేరకు సక్సెస్ అయ్యింది. ఇదే సమయంలో సామ్నా పత్రికకు రశ్మీ ఠాక్రే సంపాదకురాలిగా ఉన్నారు. గౌరవ ఎడిటర్ గా సంజయ్ రౌత్ పని చేస్తున్నారు. మొత్తంగా రశ్మీ ఠాక్రే (Rashmi Thackeray) గతంలో చేసిన ప్రతి ప్రయత్నం సఫలమైంది. కానీ ఈసారి అది వర్కవుట్ కాలేదు.
Also Read : శివ సైనికులం బాలా సాహెబ్ వారసులం