BJP Telangana : ముందస్తు వ్యూహం బీజేపీ సిద్ధం
జాతీయ కార్యవర్గ సమావేశాలకు రెడీ
BJP Telangana : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పుడే ఎన్నికలు వస్తున్నాయేమోనన్న రీతిలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయి.
ఇప్పటికే రెండోసారి ఇక్కడ గులాబీ దళం పాగా వేసింది. ముచ్చటగా మూడోసారి ఎగరేసేందుకు పావులు కదుపుతోంది. అభివృద్ధే ఎజెండాగా దూసుకు పోతోంది.
పవర్ లోకి వచ్చేందుకు ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ను ఎంపిక చేసుకుంది. ఇక టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఇప్పుడు మూడు స్తంభాలాటగా మారి పోయంది.
కాషాయం, హస్తం, గులాబీ దళం మధ్యే తీవ్ర పోటీ ఉండనుంది. రెండో ప్లేస్ లో ప్రస్తుతం కాంగ్రెస్ కొనసాగుతోందని సర్వేలు తెలియ చేస్తున్నాయి.
ఈ తరుణంలో ఎలాగైనా సరే కాషాయ జెండాను ప్రగతి భవన్ పై ఎగర వేసేందుకు పావులు కదుపుతోంది. పెద్ద ఎత్తున నాలుగు రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఎంపిక చేసింది.
ఈ మేరకు ఇప్పటికే నగరం కాషాయ మయమైంది. పార్టీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డాకు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా ర్యాలీ చేపట్టారు. ప్రత్యేక మెనూ కూడా ఏర్పాటు చేశారు.
ఇప్పటికే బీజేపీకి బలం లేక పోయినా 8 రాష్ట్రాలను కుప్ప కూల్చింది. అసంతృప్తి నేతలను చేర దీయడం బీజేపీ సర్కార్ ను ఏర్పాటు చేయడం
అన్నది పనిగా పెట్టుకుంది.
ఇదే సమయంలో తాజాగా మరాఠాలో కూడా కూల్చేసింది. ఇక రాష్ట్రంలో ఎలాగైనా పవర్ లోకి రావాలని వ్యూహం పన్నుతోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్దంగా ఉండేందుకు ప్లాన్ చేస్తోంది.
119 నియోజకవర్గాలలో సర్వే చేసింది. ఎక్కడ ఏమేం లోటుపాట్లు ఉన్నాయో పరిశీలించింది. వారిచ్చే నివేదిక ఆధారంగా వర్కవుట్ చేయనుంది. ఆరు అంశాలపై ఫోకస్ పెట్టనున్నారు.
సమావేశంలో 354 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. 118 పదాధికారులు ఉన్నారు. కలిసి వచ్చే, భావసారూప్యత కలిగిన ప్రతి
ఒక్కరినీ ఆహ్వానిస్తోంది భారతీయ జనతా పార్టీ. తన పంథాను మార్చుకుంది.
ఎలాగైనా సరే ఒకే దేశం ఒకే పార్టీ ఒకే చట్టం అన్న నినాదంతో ముందుకు వెళుతోంది బీజేపీ(BJP Telangana).
Also Read : బీజేపీ సమావేశాలపై కేటీఆర్ సెటైర్