Mark Zuckerberg : టార్గెట్ ముఖ్యం లేక పోతే క‌ష్టం – జుకెర్ బ‌ర్గ్

ఎఫ్‌బీ చీఫ్ ఉద్యోగుల‌కు సీరియ‌స్ వార్నింగ్

Mark Zuckerberg : ప్ర‌పంచ వ్యాప్తంగా సామాజిక మాధ్య‌మ వేదిక‌ల్లో టాప్ లో కొన‌సాగుతూ వ‌స్తున్న ఫేస్ బుక్ ఉద్యోగుల‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఈ మేర‌కు వ్య‌వ‌స్థాప‌డు, సీఇఓగా కొన‌సాగుతున్న మార్క్ జుక‌ర్ బ‌ర్గ్(Mark Zuckerberg) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఇక నుంచి గ‌తంలో ఉన్న‌ట్లు సంస్థ ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశాడు. ఈ మేర‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్ర‌తి ఒక్క‌రికి నిర్దేశించిన ల‌క్ష్యాన్ని త‌ప్ప‌క చేరుకోవాల్సిందేన‌ని లేక పోతే వేటు త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెల‌కొంద‌ని, ఈ ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకోని సంస్థ‌తో స‌హ‌క‌రించాల‌ని కోరారు. గ‌తంలో వేరు కానీ ఇప్పుడు ఎంపిక ప్ర‌క్రియ‌ను మ‌రింత త‌క్కువ చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

ఈసారి ఉద్యోగాల ఎంపిక‌కు సంబంధించి 30 శాతం కోత విధించనున్న‌ట్లు జుక‌ర్ బ‌ర్గ్ వెల్ల‌డించారు. ప‌ని చేస్తున్న ఉద్యోగులు ఈ విష‌యాన్ని గుర్తించాల‌ని, ఏ మాత్రం నిర్ల‌క్ష్యం వ‌హించినా ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

టార్గెట్ త‌ప్ప‌నిసరిగా అందుకునేందుకు కృషి చేయాల‌ని, లేక పోతే నిర్దాక్షిణ్యంగా తొల‌గించ‌క త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేశారు జుక‌ర్ బ‌ర్గ్(Mark Zuckerberg). ప‌నిచేయాలా లేక వ‌ద్దా అన్న‌ది మీరే నిర్ణ‌యించు కోవాల‌ని అది మీ విజ్ఞత‌కు వ‌దిలి వేస్తున్నాన‌ని పేర్కొన్నారు.

అలా చేస్తే ఇంకా మంచిద‌న్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఫేస్ బుక్ (మెటా) తీవ్ర ఆర్థిక మంద‌గ‌మ‌నాన్ని ఎదుర్కొంటోంద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

ఈ ఏడాది 10,000 వేల మంది ఇంజ‌నీర్ల‌ను నియ‌మించు కోవాల‌ని అనుకుంది. కాగా ఈసారి 7,000 వేల మందిని మాత్ర‌మే నియ‌మించు కోవాల‌ని డిసైడ్ చేసింది.

Also Read : దెబ్బ‌కు దిగొచ్చిన శాంసంగ్

Leave A Reply

Your Email Id will not be published!