Amruta Fadnavis : అమృత ఫడ్నవీస్ కు అరుదైన గౌరవం
ఇండియన్ ఆఫ్ ది వరల్డ్ పురస్కారం
Amruta Fadnavis : మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ , ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ కు అరుదైన గౌరవం లభించింది. యుకె పార్లమెంట్ లో ఇండో యునైటెడ్ కింగ్ డమ్ దేశాల సంభందాల గురించి ఆమె ప్రసంగించారు.
ఈ సందర్భంగా అమృత ఫడ్నవీస్(Amruta Fadnavis) కు యుకె పార్లమెంట్ లో ఇండియన్ ఆఫ్ ది వరల్డ్ అవార్డును కూడా అందుకున్నారు. ప్రధాన మంత్రి మోదీ కొలువు తీరిన తర్వాత భారత దేశం రూపు రేఖలు పూర్తిగా మారి పోయాయని చెప్పారు.
అత్యున్నతమైన పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు అమృత ఫడ్నవీస్. ఇరు దేశాల మధ్య సంబంధాలు రోజు రోజుకు మరింత విస్తరిస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలో అత్యంత గొప్పనైన వ్యవస్థలలో ప్రజాస్వామ్యం గొప్పదన్నారు.
దానిని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. యుద్దం ఎప్పటికీ ఆమోద యోగ్యం కాదన్నారు. ప్రజాస్వామనేది ప్రస్తుత ప్రపంచంలో అరుదైన మంత్రమని నొక్కి చెప్పారు అమృత ఫడ్నవిస్.
ఇదే సమయంలో ప్రపంచంలోని అన్ని దేశాలు ఉగ్రవాదంపై పోరాడాలని, శాంతి పునరుద్దరణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు అమృత ఫడ్నవీస్.
భారత్ నుంచి అమృత్ ఫడ్నవీస్ (Amruta Fadnavis) యుకెలో పర్యటించారు. అంతకు ముందు లండన్ లో స్వామి నారాయణ్ హిందూ దేవాలయాన్ని సందర్శించారు.
విదేశీ దేశంలో మొట్ట మొదటి అతి పెద్ద దేవాలయంగా దానికి పేరు పొందింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర స్థిరత్వం, శ్రేయస్సు కోసం ప్రార్థించారు.
Also Read : గుంటూరు నుండి అంతరిక్షం దాకా