IND vs ENG 5th Test : బౌలర్లు భళా ఇంగ్లండ్ విల విల
రెండో రోజు ఇంగ్లండ్ 5 వికెట్లకు 84 రన్స్
IND vs ENG 5th Test : స్వదేశంలో రీ షెడ్యూల్ ఐదో టెస్టు(IND vs ENG 5th Test) మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు పరగులు చేసేందుకు నానా తంటాలు పడుతోంది. భారత్ కు పెను సవాల్ విసిరిన ఆటగాళ్లు పెవిలియన్ బాట పట్టారు.
ఇక మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు 416 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రిషబ్ పంత్ , రవీంద్ర జడేజా సెంచరీల మోత మోగించారు. ఇక స్టాండ్ ఇన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్టార్ పేసర్ అరుదైన రికార్డు సృష్టించాడు.
18 ఏళ్లుగా తన పేరు మీద ఉన్న బ్రియన్ లారా రికార్డును తిరగ రాశాడు. ఏకంగా ఒకే ఒక్క ఓవర్ లో 29 పరుగులు కొట్టాడు బుమ్రా. గతంలో లారా 28 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి.
ఓ సింగిల్ తీశాడు. ఇక ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ లో ఆట ముగిసే సమయానికి 5 కీలక వికెట్లు కోల్పోయి 84 పరుగులు మాత్రమే చేసింది. బెయిర్ స్టో 12 పరుగులతో ఉండగా కెప్టెన్ బెన్ స్టోక్స్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.
భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీస్తే షమీ ఒక వికెట్ తీశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 5 వికెట్లు తీస్తే పొట్స్ 2 వికెట్లు, బ్రాడ్ , రూట్ , స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు.
ప్రధానంగా భారత ఆటగాళ్లు ఇటు బ్యాటింగ్ లోనూ అటు బౌలింగ్ లోను సత్తా చాటారు. ఇక రిషబ్ పంత్ , జడేజా షాన్ దార్ ఇన్నింగ్స్ లకు మాజీ ఆటగాళ్లు ప్రశంసలతో ముంచెత్తారు.
Also Read : లారా రికార్డ్ బద్దలు కొట్టిన బుమ్రా