Chandrababu Naidu : రేపు హర్యానాకు ఏపీ సీఎం చంద్రబాబు

హర్యానా ఫలితాలపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు...

Chandrababu Naidu : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం హర్యానా పర్యటనకు వెళ్ళనున్నారు. నయాబ్ సింగ్ సైనీ హర్యానా ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణం చేయనున్నారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు(Chandrababu Naidu) హజరుకానున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి.. 11 గంటలకు చంఢీఘర్ చేరుకుంటారు. 12 గంటల నుంచి 2 గంటల మధ్య పంచకుల, సెక్టార్ 5లోని దసరా గ్రౌండ్‌కు సిఎం చంద్రబాబు వెళతారు. అక్కడ నయాబ్ సింగ్ సెనీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకూ నిర్వహించే మీటింగ్‌లో పాల్గొంటారు. తర్వాత రాత్రి 10 గంటలకు అక్కడి నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరి విజయవాడకు వస్తారు.

Chandrababu Naidu will visit..

కాగా హర్యానా కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేతలు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. గత మార్చిలో మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన బీజేపీ సీనియర్ నేత నయబ్ సింగ్ సైనీ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయాన్ని సాధించిన బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మొత్తం 90 సీట్లలో 48 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది. ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు ఇండిపెండెంట్లు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీకి మద్దతు ప్రకటించారు.

హర్యానా ఫలితాలపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) స్పందించారు. హర్యానాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుబి మోగించిందని, ఏకంగా 50కి పైగా సీట్లను దక్కించుకుని రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుందని అన్నారు. ‘‘ హర్యానాలో విజయం ఎన్డీఏకు శుభసూచకం… సుపరిపాలన వల్ల వచ్చే లాభాలను ప్రజలు చూశారు. మంచి చేసే ప్రభుత్వాలను ప్రజలు మళ్లీ ఆదరిస్తారు. మోదీ పాలనపై ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. భారత దేశాన్ని ప్రపంచంలోనే అగ్రదేశంగా చేసేందుకు ప్రధాని మోదీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ లోనూ ఎన్ఢీఏకు మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read : Special Train : కర్ణాటక పుణ్యక్షేత్రాల సందర్శనకు డిసెంబర్ నుంచి ప్రత్యేక రైళ్లు

Leave A Reply

Your Email Id will not be published!