S Jai Shankar : జై శంకర్ కు గ్రాండ్ వెల్ కమ్
పెంటగాన్ కు చేరుకున్న మంత్రి
S Jai Shankar : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా పెంటగాన్ కు చేరుకున్న జై శంకర్ కు ఘన స్వాగతం లభించింది.
ద్వైపాక్షిక చర్చల కోసం అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ జె ఆస్టిన్ తో భేటీ అయ్యారు సుబ్రమణ్యం జై శంకర్. ప్రారంభంలో తైవాన్ జలసంధిలో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు యుఎస్ సెక్రటరీ.
ఇదే సమయంలో ఇండో – పసిఫిక్ కోసం ఉజ్వల భవిష్యత్తు కోసం భారత్, అమెరికా కలిసి పని చేస్తున్నాయని ఈ సందర్భంగా వెల్లడించారు రక్షణ కార్యదర్శి లాయిడ్ జె ఆస్టిన్. ఇదిలా ఉండగా ఎఫ్ -16 ఫైటర్ జెట్ లను అందించేందుకు పాకిస్తాన్ తో యుఎస్ వేగంపై జై శంకర్(S Jai Shankar) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ తరుణంలో విదేశాంగ శాఖ మంత్రి యుఎస్ రక్షణ కార్యదర్శిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. న్యూయార్క్ లో జరిగిన కార్యక్రమంలో జై శంకర్ ప్రసంగించారు.
ఇస్లామాబాద్ తో వాషింగ్టన్ సంబంధాలు అమెరికన్ ప్రయోజనాలకు ఉపయోగ పడలేదని పేర్కొన్నారు. అమెరికా ప్రయోజనాలకు సేవ చేయడంలో ముగిసి పోయిన సంబంధం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జై శంకర్(S Jai Shankar).
ఇదే సమయంలో లాయిడ్ జె ఆస్టిన్ ప్రసంగిస్తూ భారత్ దేశంతో యుఎస్ సుదీర్గ సంబంధాన్ని కలిగి ఉందన్నారు. ఈ బంధం మరింత బలోపేతం అవుతుందే తప్పా తొలగి పోదన్నారు. భారత్ ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటోందని స్పష్టం చేశారు జై శంకర్.
Also Read : ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు అవసరం