Elon Musk Twitter : ట్విట్ట‌ర్ మ‌స్క్ కేసులో అరుదైన తీర్పు

ఒప్పందాన్ని మూసి వేయండి

Elon Musk Twitter : ఇది ఊహించ‌ని ప‌రిణామం టెస్లా సిఇఓ , చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్ కు. ట్విట్ట‌ర్ తో ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంత‌కు ముందు సోష‌ల్ మీడియాలో టాప్ లో ఉన్న ట్విట్ట‌ర్ కొనుగోలు కోసం ముందుకు వ‌చ్చారు ఎలోన్ మ‌స్క్(Elon Musk Twitter).

ఇందుకు సంబంధించి $44 బిలియ‌న్ డాల‌ర్ల ను ఆఫ‌ర్ చేశాడు. కాగా ఒక‌వేళ ఒప్పందం గ‌నుక ర‌ద్దు చేసుకున్న‌ట్ల‌యితే 1$ బిలియ‌న్ డాల‌ర్లు న‌ష్ట ప‌రిహారంగా ఇవ్వాల‌నే దానికి ఓకే చెప్పారు.

అటు ఎలోన్ మ‌స్క్ కు ఇటు ట్విట్ట‌ర్ కు ఇదే వ‌ర్తిస్తుంది. ఎప్పుడైతే ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేయాల‌ని భావించాడో ఆనాటి నుంచి ఆ సంస్థ‌ను టార్గెట్ చేయ‌డం మొద‌లు పెట్టాడు.

ప‌క్కా బిజినెస్ మేన్ గా వ్య‌వ‌హ‌రించాడు మ‌స్క్. అంతే కాకుండా ప్ర‌వాస భార‌తీయుడైన ట్విట్ట‌ర్ సిఇఓ ప‌రాగ్ అగ‌ర్వాల్ పై లేనిపోని నింద‌లు మోపాడు. చివ‌ర‌కు ఉన్న‌ట్టుండి చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పాడు.

తాను ట్విట్ట‌ర్ డీల్ నుండి త‌ప్పుకుంటున్న‌ట్లు ఎలోన్ మ‌స్క్(Elon Musk) ప్ర‌క‌టించాడు. దీంతో త‌మ‌కు ప‌రిహారం ఇవ్వాలంటూ ట్విట్ట‌ర్ కోర్టుకు ఎక్కింది. అయితే మ‌స్క్ త‌ర‌పు లాయ‌ర్లు త‌మ వాద‌న వినిపించారు.

ట్విట్ట‌ర్ త‌మ‌ను మోసం చేసింద‌ని, అడిగిన ఫేక్ ఖాతాల విష‌యం గురించి ఇవ్వ‌లేద‌ని ఆరోపించారు. దీనిని కొట్టి పారేశారు. ఈ అంశం కోర్టుకు చేరింది. కేసును విచారించిన న్యాయ‌మూర్తి అరుదైన తీర్పు చెప్పారు.

ఒప్పందాన్ని పూర్తిగా మూసి వేయ‌మంటూ ఆదేశించారు. ఇదిలా ఉండ‌గా మ‌స్క్ $54.20 షేరు కొనుగోలును ర‌ద్దు చేస్తున్న‌ట్లు మ‌రోసారి స్ప‌ష్టం చేశాడు. న్యాయ‌మూర్తి కాథ‌రీన్ మెక్ కార్మిక్ ఇచ్చిన తీర్పు క‌ల‌క‌లం రేపింది.

Also Read : ట్విట్ట‌ర్ సిఇఓ ప‌రాగ్ పై మ‌స్క్ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!