One by Two : వన్ బై టు- నుంచి ‘నా దారి నాదే… సాంగ్ రిలీజ్
One by Two : చెర్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై శివ ఏటూరి దర్శకత్వంలో కరణం శ్రీనివాసరావు నిర్మిస్తున్న "1/2-వన్ బై టు" సినిమాలోని 'నాదారి నాదే' అనే లిరికల్ సాంగ్ ని ప్రముఖ కొరియోగ్రాఫర్ "శోభి మాస్టర్" విడుదల చేశారు.
One by Two: చెర్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై శివ ఏటూరి దర్శకత్వంలో కరణం శ్రీనివాసరావు నిర్మిస్తున్న “1/2-వన్ బై టు” సినిమాలోని ‘నాదారి నాదే’ అనే లిరికల్ సాంగ్ ని ప్రముఖ కొరియోగ్రాఫర్ “శోభి మాస్టర్” విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది, DSK స్క్రీన్స్ అధినేత DS రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకిరామ్ పామరాజు, డైరెక్టర్ శివ ఏటూరి పాల్గొన్నారు.
శోభి మాస్టర్ మాట్లాడుతూ… వీడియో సాంగ్ చూసాను, కొరియెగ్రాఫర్ కపిల్ చాలా బాగా కంపోజ్ చేశారు, హీరోయిన్ శ్రీపల్లవి డాన్స్ చాలా ఎనర్జిటిక్ & స్టైలిష్ గా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
సంపత్ నంది చిత్ర బృందాన్ని అభినందించారు.
కొత్త కాన్సెప్టుతో వచ్చే ఇలాంటి సినిమాలు పరిశ్రమకి అవసరం, వీటిని ప్రోత్సహించాలన్నారు డి.ఎస్.రావు.
దర్శకుడు శివ ఏటూరి మాట్లాడుతూ… డబ్బింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది, నిర్మాత కరణం శ్రీనివాసరావు గారు ఎక్కడ రాజీ పడకుండా నిర్మిస్తున్నారు’ అన్నారు.
No comment allowed please