Aakash Chopra : విలియ‌మ్స‌న్ పై ఆకాశ్ చోప్రా ఫైర్

పూర్ కెప్టెన్సీ అంటూ తీవ్ర ఆగ్ర‌హం

Aakash Chopra : ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ 2022 చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. 85 శాతం మ్యాచ్ లు పూర్త‌య్యాయి. ఇప్ప‌టి దాకా హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజ‌రాత్ టైటాన్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో ఉంది.

ఇదే స‌మ‌యంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ , రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిట‌ల్స్ , కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ బ‌రిలో ఉన్నాయి.

వ‌రుస‌గా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఏ జ‌ట్లు ఉంటాయ‌నేది ఇంకా తేల‌డం లేదు. ఇక పూర్ ఫ‌ర్ ఫార్మెన్స్ తో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. డేవిడ్ వార్న‌ర్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు వెళ్లాక అక్క‌డ బాగా ఆడుతున్నాడు.

ఇక ఎస్ ఆర్ హెచ్ కు న్యూజిలాండ్ స్టార్ ప్లేయ‌ర్ కేన్ విలియ‌మ్స‌న్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించి హైద‌రాబాద్ యాజ‌మాన్యం. మొద‌ట్లో బాగా ఆడినా ఆ త‌ర్వాత నిరాశ‌కు గురి చేస్తోంది ఆ జ‌ట్టు.

తాజాగా ఎస్ ఆర్ హెచ్ ఓడి పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆ జట్టు కెప్టెన్ విలియ‌మ్స‌న్ అంటూ భార‌త మాజీ క్రికెట‌ర్, కామెంటేట‌ర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆరోపించాడు. కేకేఆర్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఓడి పోవ‌డానికి కెప్టెన్ తీసుకున్న అనాలోచిత నిర్ణ‌యాలేన‌ని మండిప‌డ్డారు.

ఎంసీఎ స్టేడియంలో కీల‌క మ్యాచ్ లో కోల్ క‌తా 54 ప‌రుగుల తేడాతో హైద‌రాబాద్ పై విజ‌యం సాధించింది. ఆండ్రీ ర‌స్సెల్ 28 బంతులు ఆడి 49 ర‌న్స్ చేశాడు.

దీంతో కేకేఆర్ స్కోర్ 177 ర‌న్స్ చేసింది ఆ త‌ర్వాత ఎలాంటి ప్ర‌తిఘ‌ట‌న లేకుండానే హైద‌రాబాద్ చాప చుట్టేయ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నాడు ఆకాశ్ చోప్రా(Aakash Chopra). వాషింగ్ట‌న్ సుంద‌ర్ ను బౌలింగ్ కు తీసుకు రావ‌డ‌మే పెద్ద త‌ప్ప‌ని తెలిపాడు.

Also Read : గెలుపులో వాట్సాప్ గ్రూప్ కీల‌కం

Leave A Reply

Your Email Id will not be published!