Sourabh Bharadwaj : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పై ఆప్ ఫైర్
ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీపై ఏకపక్ష నిర్ణయం
Sourabh Bharadwaj : ఢిల్లీ ప్రభుత్వం తీసుకు వచ్చిన 2021-22 ఎక్సైజ్ పాలసీ లోపభూయిష్టంగా ఉందంటూ వెంటనే సీబీఐతో విచారణ చేపట్టాలని లెఫ్టినెంట్ గవర్నర్ నవీన్ కుమార్ సక్సేనా ఆదేశించింది.
ఎల్జీ తీసుకున్న నిర్ణయంపై ఆమ్ ఆద్మీ పార్టీ భగ్గుమంది. ఇది కేవలం కక్ష సాధింపు తో తీసుకున్న చర్యగా అభివర్ణించింది.
ఢిల్లీ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నప్పటికీ కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ మాటిమాటికీ జోక్యం చేసుకుంటోందంటూ ఆరోపించింది.
ఆప్ ను అడ్డుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తోందంటూ మండిపడింది. జీఎన్ సీటీడీ చట్టం 1991, ట్రాన్సాక్షన్ ఆప్ బిజినెస్ రూల్స్ (టీఓబీఆర్) 1993, ఢిల్లీ ఎక్సైజ్ చట్టం 2009 , ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్ 2010 ప్రాథమిక ఉల్లంఘనలను చూపుతూ ఈనెల ప్రారంభంలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నివేదిక పంపించారు లెఫ్టినెంట్ గవర్నర్ కు.
దీనిపై సక్సేనా సీబీఐకి విచారణ చేపట్టాలంటూ ఆదేశించారు. పోస్ట్ టెండర్ మద్యం లైసెన్స్ దారులకు అనవసర ప్రయోజనాలను అందించారని పేర్కొన్నారు.
స్థూల విధానపరమైన లోపాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు ఎల్జీ. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్(Sourabh Bharadwaj) శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీఎం కేజ్రీవాల్ కు పెరుగుతున్న జనాదరణను చూసి బీజేపీ తట్టుకోలేక పోతోందంటూ ఆరోపించారు.
ప్రభుత్వాన్ని చూసి కేంద్రం భయపడుతోందన్నారు. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ , ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను టార్గెట్ చేసిందని రేపు కేజ్రీవాల్ కూడా టార్గెట్ అవుతారంటూ మండిపడ్డారు. మరోసారి ఎల్జీ , ఢిల్లీ సీఎంల మధ్య వివాదం రాజుకుంది.
Also Read : ఓం ప్రకాశ్ రాజ్ భర్ కు సెక్యూరిటీ పెంపు