AAP : జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఖాతా తెరిచిన కేజ్రీవాల్ పార్టీ

బీజేపీపై మీరు చేసిన పోరాటం, గెలిచిన తీరు అభినందనీయని అన్నారు...

AAP : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ గెలుపు ఖాతా తెరిచింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో ‘ఆప్’ అభ్యర్థి మేహరాజ్ మాలిక్ గెలుపొందారు. తన సమీప బీజేపీ ప్రత్యర్థి గజయ్ సింగ్ రాణాపై ఆయన 4,770 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మాలిక్ గెలుపుతో పంజాబ్, గుజరాత్ తర్వాత మరో రాష్ట్రంలో ‘ఆప్’ ఖాతా తెరిచినట్టు అయింది.

AAP one Seat Won in…

దోడా నియోజవర్గంలో గెలుపొందిన ఆప్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మేహరాన్ మాలిక్‌కు ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. బీజేపీపై మీరు చేసిన పోరాటం, గెలిచిన తీరు అభినందనీయని అన్నారు. ఈ గెలుపుతో ఐదో రాష్ట్రంలో ఆప్ అడుగుపెట్టిందని, ఇందుకు పార్టీ నేతలు, కార్యకర్తలందరినీ అభినందిస్తున్నానని ట్వీట్ చేశారు. మరోవైపు, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ‘ఆప్’ను నిరాశపరచారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ వెలువడిన ఫలితాల్లో ‘ఆప్’ ఇంకా ఖాతా తెరువలేదు. మరికొద్ది రోజుల్లో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో పాటు ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ‘ఆప్’కు హర్యానా, జమ్మూకశ్మీర్ ఫలితాలు కీలకంగా మారాయి.

Also Read : Vinesh Phogat : ప్రముఖ భారత రెజ్లర్ ‘వినేష్ ఫోగట్’ జలనా సీటు నుంచి విజయం

Leave A Reply

Your Email Id will not be published!