AB De Villiers : శాంస‌న్ అద్భుత‌మైన ఆట‌గాడు

ఏబీ డివిలియ‌ర్స్ కామెంట్స్

AB De Villiers : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ను అభినంద‌న‌ల‌తో ముంచెత్తాడు వ‌ర‌ల్డ్ క్రికెట‌ర్ ఏబీ డివిలియ‌ర్స్ . అద్భుత‌మైన ఆట‌గాడు అంటూ కితాబు ఇచ్చారు. ఒక‌టి రెండు సంవ‌త్స‌రాల‌లో శాంస‌న్ భార‌త జ‌ట్టుకు స్కిప్ప‌ర్ అయ్యే ఛాన్స్ త‌ప్ప‌క ఉంద‌న్నారు.

AB De Villiers Praises

ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా టూర్ కు సంబంధించి వ‌న్డే సీరీస్ కు శాంస‌న్ ఎంపిక‌య్యాడు. దీనిపై స్పందించారు ఏబీ డివిలియ‌ర్స్(AB De Villiers) . ఇటీవ‌లే దేశీవాళి టోర్నీలో సెంచ‌రీ మోత మోగించాడు. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు సార‌థిగా ఉన్నాడు.

త‌నను తాము వ‌దులుకునే ప్ర‌స‌క్తి లేద‌ని ఇప్ప‌టికే యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టుకు మెంటార్ గా ఉన్నాడు శ్రీ‌లంక మాజీ క్రికెట‌ర్ కుమార సంగ‌క్క‌ర‌. బ‌హుళ ఫార్మాట్ ల‌లో రాణించే స‌త్తా క‌లిగిన ఆట‌గాడు శాంస‌న్ అంటూ తెలిపాడు ఏబీ డివిలియ‌ర్స్.

జియో కామెంట‌రీ నిపుణుల ప్యానెల్ లో భాగంగా ఉన్నారు ద‌క్షిణాఫ్రికా లెజెండ్ క్రికెట‌ర్ ఏబీ డివిలియ‌ర్స్. ద‌క్షిణాఫ్రికాలో అద్భుతంగా రాణిస్తాడ‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు. ఇదిలా ఉండగా చాలా కూల్ గా ఉంటాడ‌ని, కెప్టెన్ గా ఉండేందుకు అన్ని విధాలుగా అర్హుడ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు.

Also Read : Balineni Srinivas Reddy : మాదే ప్ర‌భుత్వం జ‌గ‌నే సీఎం

Leave A Reply

Your Email Id will not be published!