Abdul Razzaq Bumrah : షాహీన్ అఫ్రిది ముందు బుమ్రా ఎంత

మాజీ పాకిస్తాన్ క్రికెట‌ర్ ర‌జాక్ కామెంట్స్

Abdul Razzaq Bumrah : పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ అబ్దుల్ రజాక్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌మ దేశానికి చెందిన పేస‌ర్ ష‌హీన్ అఫ్రిదీతో పోల్చాడు. ఓ బ‌చ్చా బౌల‌ర్ అంటూ ఎద్దేవా చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌స్తుతం ర‌జాక్ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బుమ్రాను అవ‌మాన‌ప‌ర్చిన అబ్దుల్ ర‌జాక్(Abdul Razzaq) పై ఫ్యాన్స్ మండి ప‌డుతున్నారు. ష‌హీన్ ద‌రిదాపుల్లోకి కూడా జ‌స్ప్రీత్ రాలేడ‌ని పేర్కొన్నాడు.

ప్ర‌పంచంలోనే మోస్ట్ పాపుల‌ర్ పేస‌ర్ల‌లో అఫ్రిదీ ఒక‌డ‌ని కానీ బుమ్రా కాద‌న్నాడు. అంతే కాదు ఎగ‌తాళి చేశాడు. అంతే కాదు బుమ్రాను ఓ బేబి బౌల‌ర్ అంటూ నోరు పారేసుకున్నాడు. తాను వ‌సీం అక్ర‌మ్ , మెక్ గ్రాత్ వంటి అద్భుత బౌల‌ర్ల‌ను ఎదుర్కొన్నాన‌ని కానీ త‌న ముందు బుమ్రా ఓ పిల్ల బౌల‌ర్ అంటూ పేర్కొన్నాడు. ఒక‌వేళ ఇదే స‌మ‌యంలో గ‌నుక ఉంటే తాను బుమ్రాకు చుక్క‌లు చూపించే వాడిన‌ని స్ప‌ష్టం చేశాడు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం జ‌స్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) వెన్ను నొప్పితో బాధ ప‌డుతున్నాడు. ప్ర‌స్తుతం ప్రాక్టీస్ లో నిమ‌గ్న‌మ‌య్యాడు. స్వ‌దేశంలో జ‌రిగే ఆస్ట్రేలియా సీరిస్ తో ఆడేందుకు రెడీ అయ్యాడు. అయితే పూర్తి ఫిట్ నెస్ తో ఉంటే స‌రి లేక పోతే ఎంపిక కావ‌డం క‌ష్ట‌మేన‌ని బీసీసీఐ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది.

ఇదిలా ఉండ‌గా త్వ‌ర‌లో భార‌త్ లో ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. మ‌రో వైపు కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ కూడా గాయం నుంచి కోలుకుంటే జ‌ట్టులోకి వ‌స్తాడు లేదంటే ఇంటి ముఖం ప‌ట్టాల్సిందే.

Also Read : ఆడ‌బిడ్డ‌ల విజ‌యం చోప్రా స‌లాం

Leave A Reply

Your Email Id will not be published!