Abhishek Banerjee : ఈడీ నిర్వాకంపై సుప్రీంకోర్టుకు వెళతా
మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ
Abhishek Banerjee : కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మరోసారి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తో పాటు ఆయన భార్య కు కూడా సమన్లు జారీ చేసింది. గతంలో హాజరు కావాల్సి ఉండగా కోర్టును ఆశ్రయించారు.
దీంతో ఈనెల 11న ఢిల్లీ హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టి పారేసింది. మనీ లాండరింగ్ కేసులో వీరిని ఈడీ ప్రశ్నించనుంది. దీనికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ కావాలని తమను టార్గెట్ చేస్తోందంటూ అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee )ఆరోపించారు.
న్యాయం తమ వైపు ఉందని తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. దేశ అత్యున్నత న్యాయ స్థానంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు.
పశ్చిమ బెంగాల్ లో బొగ్గు కుంభకోణంతో ముడి పడి ఉండడంతో మనీ లాండరింగ్ కింద అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee ), భార్య రుజీరా బెనర్జీలను ఈడీ ప్రశ్నించనుంది. వచ్చే వారం ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది.
ఈ సందర్భంగా అభిషేక్ బెనర్జీ మీడియాతో మాట్లాడారు. కంటికి సంబంధించిన శస్త్ర చికిత్స జరిగిందని, డాక్టర్లు తనకు బెడ్ రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారని తెలిపారు.
ఇదిలా ఉండగా బెంగాల్ లో బీజేపీ, టీఎంసీల మధ్య యుద్దం తారా స్థాయికి చేరింది. ఇటీవల ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ప్రచారం చేశారు.
దీంతో కేంద్ర సర్కార్ తమ ఆధీనంలోని దర్యాప్తు సంస్థలను పురమాయిస్తోంది. ఇవాళ ఆయన ఢిల్లీకి వెళుతూ మీడియాతో మాట్లాడారు.
కేసు బెంగాల్ తో సంబంధం ఉన్నందున తనను ఢిల్లీకి బదులు కోల్ కతాలో ప్రశ్నించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసినట్లు వెల్లడించారు.
Also Read : కర్ణాటక జడ్జీలకు ‘వై’ కేటగిరి భద్రత