Ajay Devagan Esha Deol : భారత్ కు దేవగన్..ఈషా కంగ్రాట్స్
టీమిండియాకు అభినందనల వెల్లువ
Ajay Devagan Esha Deol : దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 మహిళా క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ను 7 వికెట్ల తేడాతో ఓడించి విశ్వ విజేతగా నిలిచింది భారత జట్టు. ఈ సందర్బంగా టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ , అమిత్ చంద్ర షా, స్మృతీ ఇరానీ, నిర్మలా సీతారామన్ తో పాటు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా, తదితర ప్రముఖులు కంగ్రాట్స్ తెలిపారు.
ఈ సందర్భంగా మీరు సాధించిన విజయం కోట్లాది భారతీయులకు స్పూర్తి దాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సినిమా రంగానికి చెందిన నటీ నటులు సైతం స్పందించారు. తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తో పాటు హేమమాలిని కూతురు ఈషా డియోల్(Ajay Devagan Esha Deol) కూడా టీమిండియాను అభినందించారు.
అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని కట్టడి చేసిన టిటాస్ సాధు, అర్చనా దేవి, పార్షవి చోప్రాకు కంగ్రాట్స్ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రపంచ కప్ విజేతగా నిలిచినందుకు భారత అమ్మాయిల జట్టుకు ఏకంగా రూ. 5 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా దక్కనున్నాయి. అంతే కాకుండా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సైతం ఒక్కొక్కరికీ రూ. లక్ష ప్రకటించింది.
రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా కోరారు. యువతకు, మహిళలకు ఈ గెలుపు ఒక పాఠంగా ఉంటుందన్నారు.
Also Read : ఉత్కంఠ పోరులో భారత్ భళా