Actor Nagarjuna : ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై కోర్టును ఆశ్రయిస్తానంటున్న నాగార్జున

ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ఉంది...

Nagarjuna : ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున స్పందించారు. నిబంధనల మేరకే ఎన్ కన్వెన్సన్ నిర్మాణం జరిగిందని వివరించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు మాకు సంబంధించి ఎలాంటి నోటీసు ఇవ్వలేదని తెలిపారు. స్టే ఆర్డర్‌‌కు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేశారని వివరించారు. ‘ హైడ్రా అధికారులు ఈ విధంగా చేయడం బాధ కలిగించింది. నా ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరిగింది. వాస్తవాలను తెలియజేసేందుకు మీకు వీడియో రిలీజ్ చేస్తోన్నా. చట్టాన్ని ఉల్లంఘించేలా మేం వ్యవహరించలేదు. ఎన్ కన్వెన్షన్ నిర్మించిన భూమి పట్టా భూమి, అందులో ఒక్క అంగుళం ఆక్రమణకు గురి కాలేదు అని’ నాగార్జున(Actor Nagarjuna) స్పష్టం చేశారు.

Nagarjuna Comment

‘ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం కూల్చివేతపై అధికారులు ప్రవర్తించిన తీరు బాధ కలిగించింది. ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ఉంది. తప్పుడు సమాచారం ఆధారంగా కన్వెన్షన్ కూల్చివేశారు. ఈ రోజు ఉదయం కూల్చివేతకు ముందు నాకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. నేను ఇప్పటికీ చట్టాన్ని గౌరవిస్తా. కన్వెన్షన్‌కు సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉంది. అందులో కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, నేనే కూల్చివేసే వాడిని. నిబంధనల మేరకు నిర్మాణాలు జరిగాయి. కన్వెన్షన్ కూల్చివేతతో ప్రజల నిజమేనని భావిస్తారు. ఏం జరిగిందో తెలియజేయాలనే ఉద్దేశంతో వీడియో రిలీజ్ చేస్తున్నా. అధికారులు చేసిన తప్పుడు చర్యలకు సంబంధించి నేను కోర్టును ఆశ్రయిస్తా అని’ నాగార్జున తెలిపారు.

Also Read : KTR-BRS : మహిళా కమిషన్ ఆఫీస్ కు కేటీఆర్…బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్న జనం

Leave A Reply

Your Email Id will not be published!