Actor Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి
దొంగతనం చేయడానికే సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన అతడు....
Saif Ali Khan : బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన ప్రధాన నిందితుడు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం అతడిని థానేలో అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ దాడి ఘటనపై ముంబై పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన విషయాలు వెల్లడించారు. “సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కేసులో అరెస్టయిన నిందితుడు బంగ్లాదేశీయుడు. అతడి పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్.
అతని వయస్సు 30 సంవత్సరాలు. అతను భారతీయుడనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి తన పేరును విజయ్ దాస్ గా మార్చుకున్నాడు. కొన్ని నెలల క్రితమే ముంబైకి వచ్చిన అతడు ఆ తర్వాత కొద్దిరోజులు ముంబై నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడు 15 రోజుల క్రితమే ముంబై తిరిగి వచ్చిన అతడు హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేసేందుకు చేరాడు. దొంగతనం చేయడానికే సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన అతడు.. ఆ సమయంలో అడ్డు వచ్చిన సైఫ్ పై దాడి చేశాడు. ఈ కేసుపై నిందితుడిని కోర్టులో హజరుపరిచి.. ఆ తర్వాత పోలీసు కస్టడీకి తీసుకుంటాము. ఆ తర్వాతే తదుపరి విచారణ ప్రారంభిస్తాము” అని అన్నారు ముంబై పోలీసులు.
Saif Ali Khan Case Updates
సైఫ్ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు, ఎందుకు వచ్చాడు అనే ప్రశ్నకు సంబంధించి ప్రాథమిక విచారణ ఇంకా కొనసాగుతోందని డీసీపీ తెలిపారు. సైఫ్‌పై దాడి చేసిన వ్యక్తిని 72 గంటల తర్వాత అరెస్టు చేశారు. ముంబయి పోలీసులు, క్రైం బ్రాంచ్‌కు చెందిన 30 బృందాలు దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి.ఈ బృందంలో 100 మందికి పైగా అధికారులు ఉన్నారు. దాడి చేసిన వ్యక్తి కోసం 15కి పైగా నగరాల్లో వెతికారు. చివరకు థానేలో నిందితుడిని అరెస్టు చేశారు.
బాంద్రాపోలీస్ స్టేషన్ పరిధిలో 2025 జనవరి 16న నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించి అతడిని కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో సైఫ్ శరీరంలో ఆరు చోట్ల తీవ్రగాయాలు కాగా.. రెండు లోతుగా అయినట్లు డాక్టర్స్ తెలిపారు. శస్త్ర చికిత్స చేసి సైఫ్ శరీరం నుంచి రెండున్నర అంచుల కత్తిని తొలగించారు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ముంబైలోని లీలావతిఆసుపత్రిలో సైఫ్ చికిత్స తీసుకుంటున్నారు.
Also Read : Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్ లో 18కి చేరిన మృతుల సంఖ్య