Thalapathy Vijay : సినీవాలిలో త‌ళ‌ప‌తి సెన్సేష‌న్

విల‌క్ష‌ణ న‌టుడు జోసెఫ్ విజయ్

Thalapathy Vijay : త‌మిళ సినీ రంగంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానం క‌లిగి ఉన్న అరుదైన న‌టుడు విజ‌య్. ఆయ‌న పూర్తి పేరు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. అభిమానులు పిలుచుకునే పేరు త‌ళ‌ప‌తి. జూన్ 22, 1974లో పుట్టారు చెన్నైలో. వ‌య‌సు 48 ఏళ్లు. సినీ ఇండ‌స్ట్రీలో మినిమం గ్యారెంటీ క‌లిగిన న‌టుడిగా గుర్తింపు పొందారు. న‌టుడే కాదు గాయ‌కుడు కూడా. 1984 నుండి 1988 దాకా చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించాడు. 1992 నుండి హీరోగా త‌న కెరీర్ ప్రారంభించాడు. నేటికీ కొన‌సాగుతున్నాడు. ద‌క్షిణాదిలో అత్య‌ధిక పారితోషకం అందుకునే న‌టుడిగా విజ‌య్ గుర్తింపు పొందాడు. పేరెంట్స్ ఎస్ . చంద్ర‌శేఖ‌ర్, త‌ల్లి శోభ‌.

త‌ళ‌ప‌తి అంటే క‌మాండ‌ర్ అని అర్థం. అభిమానులు తాము ఆరాధించే విజ‌య్ ని నాయ‌కుడిగా పిలుచుకుంటారు. ఇక తండ్రి పేరు పొందిన ద‌ర్శ‌కుడు. వెట్రీ నుండి ఎంగ‌ల్ నీతి వ‌ర‌కు చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించాడు. నాల‌య తీర్పులో మెయిన్ స్ట్రీమ్ న‌టుడిగా ఎంట్రీ ఇచ్చాడు విజ‌య్(Vijay). 1996లో ద‌ర్శ‌కుడు విక్ర‌మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో పూవె ఉన‌క్కాగ చిత్రంలో న‌టించాడు. అది సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. ఆ త‌ర్వాత వెనుదిరిగి చూడ‌లేదు. ఇప్ప‌టి దాకా కెరీర్ ప్రారంభం నుంచి 61 మూవీస్ ల‌లో న‌టించాడు. 32 పాట‌లు పాడాడు. లెక్క‌లేన‌న్ని అవార్డులు అందుకున్నాడు.

విజ‌య్ విజ‌య‌వంత‌మైన సినిమాల‌లో బొబ్బిలి రాయుడు, స‌ర్కార్ , అదిరింది, ఏజెంట్ భైర‌వ‌, పోలీస్ , జిల్లా, పులి, ద‌మ్ముంటే కాస్కో, స్నేహితుడు, విజిల్ , మాస్ట‌ర్, బీస్ట్ ఉన్నాయి. ప్ర‌స్తుతం లియో విడుద‌ల‌కు సిద్దం కానుంది. సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నా త్వ‌ర‌లోనే పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇవాళ విజ‌య్ పుట్టిన రోజు. హ్యాపీ బ‌ర్త్ డే త‌ళ‌ప‌తి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్.

Also Read : Dasoju Sravan : జీస‌స్ స్పూర్తితో కేసీఆర్ పాల‌న – శ్ర‌వ‌ణ్

Leave A Reply

Your Email Id will not be published!