Thalapathy Vijay PK : కోలీవుడ్ లో లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఏకైక అరుదైన నటుడు తలపతి విజయ్(Thalapathy Vijay PK) or (actor vijay). ఇప్పటికే పలువురు నటులు తమిళనాట రాజకీయాలలో తమదైన ముద్ర వేశారు (Tamil Nadu politics).
కానీ కొందరు మాత్రమే సక్సెస్ కాగలిగారు. కమల్ హాసన్ పార్టీ గత ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయింది.
ఇక తలైవా రజనీకాంత్ పార్టీ పెట్టి చివరకు తనకు చేత కాదంటూ చేతులెత్తేశారు.
మళ్లీ సినిమాల వైపు మళ్లారు. రాజకీయం వేరకు సినిమా రంగం వేరు (film industry).
ఇక తలపతి విజయ్ కొంత కాలంగా రాజకీయాల్లోకి వస్తారని తెగ ప్రచారం జరుగుతోంది.
ఇటీవల జరిగిన స్థానిక, పురపాలిక ఎన్నికల్లో సైతం పోటీలోకి దిగింది.
పుదుచ్చేరి సీఎం రామస్వామి తలపతి విజయ్ ను కలవడం అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారి తీసింది.
తాజాగా ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ( వ్యూహకర్త) ప్రశాంత్ కిషోర్ , తలపతి విజయ్ కలిస భవిష్యత్తు రాజకీయాలపై చర్చించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని అందుకే ఆయనతో భేటీ అయినట్లు టాక్. విజయ్ తండ్రి విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో పార్టీని స్థాపించారు.
ఇద్దరి మధ్య పొరపొచ్చాలు కూడా వచ్చాయి. విజయ్ కోర్టుకు కూడా ఎక్కాడు. గత కొంత కాలంగా పాలిటిక్స్ లోకి వస్తే
తన సినీ కెరీర్ కు దెబ్బ తగులుతుందని భావించిన విజయ్ పాలిటిక్స్(Thalapathy Vijay PK) ఎంట్రీపై దాట వేస్తూ వస్తున్నారు.
ఇక తమిళనాడులో డీఎంకే (DMK in Tamil Nadu) పవర్ లో ఉంది. అన్నాడీఎంకే బలహీనంగా ఉంది. బీజేపీ మిణుకు మిణుకు మంటోంది.
ప్రత్యామ్నాయంగా తాను పెట్టే పార్టీకి ఫుల్ టైమ్ కేటాయించినట్లయితే పవర్ లోకి రావచ్చని ఆలోచనలో విజయ్ ఉన్నట్లు టాక్.
స్థానిక, పట్టణ ఎన్నికల్లో గెలుపొందిన వారిని విజయ్ అభినందించారు. తమిళనాడులో డీఎంకే (DMK in Tamil Nadu) కు పనిచేసిన పీకే దానిని పవర్ లోకి తీసుకు వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.
కొన్ని రోజుల కిందట రహస్యంగా ప్రశాంత్ కిషోర్ తో విజయ్ భేటీ అయినట్లు సమాచారం. డీఎంకే కాకుండా మిగతా పార్టీలకు చెందిన వారంతా తను ఏర్పాటు చేయబోయే పార్టీలో చేరతారని అందుకే అడుగులు వేసినట్లు టాక్.
గత ఎన్నికల్లో డీఎంకేకు విజయ్ సపోర్ట్ చేశారు. ఒక వేళ తలపతి ఎంటర్ అయితే ఆ పార్టీకి కొంత దెబ్బేనని చెప్పక తప్పదు.
Also Read : కీలక భేటీ వెనుక మతలబు ఏంటి