Actor Yash : ఆనాటి అవ‌మానం ఈనాటి విజ‌యం

కేజీఎఫ్ హీరో య‌శ్ సంచ‌ల‌న కామెంట్స్

Actor Yash : గ‌తంలో ఎన్నో సినిమాల‌లో న‌టించినా కేవ‌లం ఒకే ఒక్క సినిమాతో అత‌డిని భార‌త దేశంలో టాప్ హీరోగా నిల‌బెట్టేలా చేసింది. ఇంత‌కూ ఆ స్టార్ ఎవ‌రో ఈపాటికే అర్థ‌మై పోయి ఉంటుంది.

మోస్ట్ పాపుల‌ర్ యాక్ట‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన య‌శ్(Actor Yash). ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన కేజీఎఫ్ ఇండియాను షేక్ చేసింది.

దీంతో సీక్వెల్ గా కేజీఎఫ్ -2 మూవీ రానుంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. ఇందులో య‌శ్ తో పాటు ప్ర‌కాశ్ రాజ్ , సంజ‌య్ ద‌త్ , ర‌వీనా ఠాండ‌న్ న‌టించారు.

ఈ మూవీని ఈనెల 14న విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇక కేజీఎఫ్ -2కి సంబంధించిన పోస్ట‌ర్లు, ట్రైల‌ర్ కి ఊహించ‌ని రీతిలో రెస్పాన్స్ వ‌స్తోంది.

సినిమాకు సంబంధించి కొన్ని డైలాగులు య‌శ్ (Actor Yash) రాశాడ‌ని ఇటీవ‌లే డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ చెప్పాడు. ఇక తాజాగా రిలీజ్ అయిన మూవీ ట్రైల‌ర్ దుమ్ము రేపుతోంది.

తాజాగా త‌న మూవీతో పాటు త‌న వ్య‌క్తిగ‌త విష‌యాలు పంచుకున్నాడు రాక్ స్టార్ య‌శ్. చిత్ర ప్ర‌మోష‌న్ లో పాల్గొన్న స‌ద‌రు న‌టుడు త‌న గ‌త జీవితం గురించి చెప్పాడు.

పాఠ‌శాల‌లో చ‌దువుకుంటున్న స‌మ‌యంలో తాను ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నాన‌ని చెప్పాడు. అంద‌రూ డాక్ట‌ర్లు, ఇంజ‌నీర్లు, క‌లెక్ట‌ర్లు అవుతామ‌ని చెప్పార‌ని కానీ తాను మాత్రం యాక్ట‌ర్ ను అవుతాన‌ని అన‌డంతో విప‌రీతంగా అవ‌మానించారంటూ వాపోయాడు.

కానీ తాను అనుకున్న‌ది సాధించాన‌ని ప్ర‌స్తుతం మీ ముందు విజ‌య‌వంత‌మైన న‌టుడిగా ఉన్నాన‌ని చెప్పాడు య‌శ్. సో ఆనాటి అవ‌మాన‌మే ఈనాటి విజ‌యానికి కార‌ణ‌మ‌న్నాడు.

Also Read : త‌ల‌ప‌తి..ర‌ష్మిక మూవీ ప్రారంభం

Leave A Reply

Your Email Id will not be published!