Jayasudha Joins : బీజేపీ తీర్థం పుచ్చుకున్న జ‌య‌సుధ‌

పేద‌ల‌కు సేవ చేయాల‌ని పార్టీలో చేరా

Jayasudha Joins : ప్ర‌ముఖ న‌టి జ‌య‌సుధ బుధ‌వారం భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు. పేద‌ల‌కు సేవ చేయాల‌నే ఉద్దేశంతో తాను పార్టీలో చేరిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం ఉన్న పార్టీల‌లో బీజేపీనే బెట‌ర్ అని తాను భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

సినీ రంగంలో ఆమెకు మంచి పేరుంది. స‌హ‌జ న‌టిగా గుర్తింపు పొందింది. త‌ల్లి పాత్రల‌లో ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎమ్మెల్యేగా కూడా ప‌ని చేశారు. బీజేపీ(BJP) జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , బీజేపీ రాష్ట్ర చీఫ్ కిష‌న్ రెడ్డి, జాతీయ ఉపాధ్య‌క్షురాలు డీకే అరుణ స‌మక్షంలో జ‌య‌సుధ చేరారు.

Jayasudha Joins BJP

ఢిల్లీలో ఆమె కాషాయ గూటికి చేరారు. తెలుగు, త‌మిళం, త‌దిత‌ర భాష‌ల్లో న‌టించారు. ఇటీవ‌లే ఆమె బీజేపీ చీఫ్ కిష‌న్ రెడ్డిని క‌లిశారు. త్వ‌ర‌లో తెలంగాణలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా ఆమె సికింద్రాబాద్ నుంచి పోటీ చేయొచ్చ‌ని స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా బీజేపీ సీనియ‌ర్ నేత త‌రుణ్ చుగ్ జ‌య‌సుధ‌కు పార్టీ కండువా క‌ప్పి ఆహ్వానించారు. ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా 2009 నుండి 2014 వ‌ర‌కు ఎమ్మెల్యేగా ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించార‌ని కొనియాడారు. తాను బీజేపీలో చేరేందుకు ప్ర‌ధాన కార‌ణం మోదీ అని పేర్కొన్నారు జ‌య‌సుధ‌.

Also Read : CM KCR : రైతు రుణ మాఫీ పునః ప్రారంభించాలి

Leave A Reply

Your Email Id will not be published!