Orphan Childrens Comment : అనాథ పిల్ల‌లు ప్ర‌భుత్వ బిడ్డ‌లు

సీఎం కేసీఆర్ సారూ సలాం

Orphan Childrens Comment : వాళ్లు ఎవ‌రూ లేని వాళ్లు. ఏ ఆస‌రాకు నోచుకోని వాళ్లు. ఎలాంటి గుర్తింపున‌కు అర్హులైన వారిగా నిన్న‌టి దాకా ప‌రిగ‌ణించ బ‌డ్డారు. ఎక్క‌డికి వెళ్లినా ఛీత్కారానికి లోనైన వాళ్లు. కానీ అది నిన్న‌టి దాకా నేటి నుంచి వారికి తెలంగాణ ప్ర‌భుత్వ‌మే అండ‌గా ఉంటుంది. ఇది దేశ చ‌రిత్ర‌లోనే ఓ సంచ‌ల‌నాత్మ‌క‌మైన నిర్ణ‌యం. ఇందుకు ప్ర‌త్యేకంగా కేసీఆర్(KCR) ను అభినందించాల్సిందే. ఏ మాట‌కు ఆమాట చెప్పుకోవాల్సి వ‌స్తే ఉద్య‌మ కాలంలో తిరిగినందు వ‌ల్ల‌నేమో కొంత మాన‌వాతా దృక్ఫ‌థంతో అప్పుడ‌ప్పుడు ఆలోచిస్తారు. అంతే కాదు ప్ర‌త్య‌ర్థులు సైతం విస్తు పోయేలా చేస్తారు. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత ఈ 9 సంవ‌త్స‌రాల కాలంలో అద్భుత‌మైన ఆలోచ‌నకు శ్రీ‌కారం చుట్టారు కేసీఆర్.

Orphan Childrens Comment To KCR

రాష్ట్రంలో ల‌క్ష‌లాది మంది పిల్ల‌లు అనాథ‌లుగా ఉన్నారు. వీరి కోసం కొన్ని స్వ‌చ్చంధ సంస్థ‌లు, దాత‌లు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో వారు స‌మాజంలో నిరాద‌ర‌ణ‌కు లోన‌వుతున్నారు. త‌ల్లిదండ్రులు లేని వారికి ఆల‌నా పాల‌నా చూసే వారు క‌రువై పోతున్నారు. వీళ్ల‌కు కూడా మ‌న‌సు అనేది ఒక‌టి ఉంటుంద‌ని, వారికి కూడా స‌రైన స‌మ‌యంలో భ‌ద్ర‌త క‌ల్పించి, ఆస‌రా ఇవ్వ‌గ‌లిగితే కొంత మేర‌కు మేలు చేకూర్చిన‌ట్లవుతుంద‌ని భావించారు కేసీఆర్(KCR). ఈ ఆలోచ‌న వ‌చ్చిన వెంట‌నే ఆచ‌ర‌ణ‌లోకి దిగారు. ఆ వెంట‌నే అసాధార‌ణ‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. ఇక నుంచి అనాథ పిల్ల‌లకు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌న్నారు. అంతే కాదు పిల్ల‌లు అనాథ‌లు కాదు..వాళ్లు ప్ర‌భుత్వ బిడ్డ‌లంటూ స్ప‌ష్టం చేశారు. ఇందుకోసం ఓ పాల‌సీని తీసుకు వ‌స్తున్న‌ట్లు వెల్ల‌డించారు కేసీఆర్. ఇలాంటి మేలు చేకూర్చే నిర్ణ‌యం ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఎక్క‌డా ఎవ‌రూ..ఏ సీఎం తీసుకోలేదు.

ఇక నుంచి తెలంగాణ స‌ర్కార్ అనాథ‌ల‌ను ద‌త్త‌త తీసుకుంటుంది. సౌక‌ర్యాలు క‌ల్పిస్తుంది. మాన‌వ‌తా దృక్ప‌థంతో బ‌తికేందుకు కావాల్సిన సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు కేసీఆర్(KCR). కేవలం అనాథ‌ల కోస‌మే పాల‌సీని తీసుకు వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం హ‌ర్ష‌ణీయం, అభినంద‌నీయం. ఇత‌ర ప‌థ‌కాల లాగానే అనాథ‌ల‌ను ర‌క్షించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందు కోసం స‌మ‌గ్ర చ‌ట్టం ప్ర‌వేశ పెట్ట‌నుంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో ఇక నుంచి పిల్ల‌లు అనాథ‌లు కాదు అన్న‌ది తేల్చారు. ఏది ఏమైనా కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణ‌యం ఇత‌ర రాష్ట్రాల‌కు , కేంద్రంలో కొలువు తీరిన మోదీని క‌ళ్లు తెరిపిస్తుంద‌ని , ఆద‌ర్శ ప్రాయం అవుతుంద‌ని ఆశిద్దాం.

Also Read : Jayasudha Joins : బీజేపీ తీర్థం పుచ్చుకున్న జ‌య‌సుధ‌

 

Leave A Reply

Your Email Id will not be published!