BJP Focus List : బీజేపీ అభ్య‌ర్థుల‌పై ఉత్కంఠ

తెలంగాణ‌పై ట్ర‌బుల్ షూట‌ర్ ఫోక‌స్

BJP Focus List : భార‌తీయ జ‌న‌తా పార్టీ(BJP) హైక‌మాండ్ సీరియ‌స్ గా ఉంది తెలంగాణ విష‌యంలో. ఇప్ప‌టికే ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ ను, రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ ల‌ను త‌ప్పించింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇదే స‌మ‌యంలో గ‌తంలో పార్టీ చీఫ్ గా ప‌ని చేసిన‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఈసారి ఎలాగైనా ప‌వ‌ర్ లోకి రావాల‌ని పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా ఫోక‌స్ పెట్టారు. ఈ మేర‌కు కిష‌న్ రెడ్డికి, ఇత‌ర సీనియ‌ర్ల‌కు దిశా నిర్దేశం చేశారు. దీంతో ఒక‌వేళ కేసీఆర్ గ‌నుక త్వ‌ర‌లోనే ఎన్నిక‌ల తేదీని ప్ర‌క‌టిస్తే ఎవ‌రెవ‌రు బ‌రిలో ఉండాల‌నేది కూడా ఇప్ప‌టికే ఓ అంచ‌నాకు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

BJP Focus List Ready

పార్టీ ప‌రంగా తెలంగాణ‌లో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇప్ప‌టికే అభ్య‌ర్థుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం. అంబ‌ర్ పేట్ నుంచి కిష‌న్ రెడ్డి(G Kishan Reddy), ముషీరాబాద్ నుంచి కె. ల‌క్ష్మ‌ణ్ , క‌రీంన‌గ‌ర్ నుంచి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ , బోధ్ నుంచి సోయం బాపురావు, ఆర్మూర్ నుంచి ధ‌ర్మ‌పురి అర్వింద్ , గ‌జ్వేల్ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ ను బ‌రిలోకి దింప‌నుంది.

ఇక ఇప్ప‌టికే ఎమ్మెల్యేగా ఉన్న ర‌ఘునంద‌న్ రావు దుబ్బాక నుంచి పోటీ చేయ‌నున్నారు. జేజ‌మ్మ‌గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి డీకే అరుణ గ‌ద్వాల నుంచి, జితేంద‌ర్ రెడ్డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుంచి , కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి మునుగోడు నుంచి, ముర‌ళీధ‌ర్ రావు వేముల వాడ నుంచి పోటీ లో ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా.

ఎల్బీ న‌గ‌ర్ నుంచి ఇంద్ర సేనా రెడ్డి, చెన్నూరు నుంచి వివేక్ , మెద‌క్ నుంచి విజ‌య శాంతి, నిజామాబాద్ అర్బ‌న్ నుంచి లక్ష్మీనారాయ‌ణ‌, మ‌ల్కాజ్ గిరి నుంచి రామ‌చంద్ర‌రావు, ఉప్ప‌ల్ నుంచి ప్ర‌సాద్ , క‌ల్వ‌కుర్తి నుంచి త‌ల్లోజు ఆచారి, సికింద్రాబాద్ నుంచి జ‌య‌సుధ‌, నిర్మ‌ల్ నుంచి మ‌హేశ్వ‌ర్ రెడ్డి, ఆసిఫాబాద్ నుంచి ర‌మేష్ రాథోడ్ ఉండ‌నున్నారు.

ఇక ఖ‌మ్మం నుంచి పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి, ఆందోల్ నుంచి బాబు మోహ‌న్ , ప‌టాన్ చెరు నుంచి నందీశ్వ‌ర్ గౌడ్ , కుత్బుల్లాపూర్ నుంచి కూన శ్రీ‌శైలం గౌడ్ , భువ‌న‌గ‌రి నుంచి బూర న‌ర్స‌య్య గౌడ్ , తాండూరు నుంచి విశ్వేశ్వ‌ర్ రెడ్డి, వ‌రంగ‌ల్ నుంచి మోహ‌న్ రావు, హుజూరాబాద్ నుంచి ఈట‌ల జ‌మున , గోషా మ‌హ‌ల్ నుంచి విక్ర‌మ్ గౌడ్ పేర్లు దాదాపు ఖ‌రారైన‌ట్లు స‌మాచారం.

Also Read : Orphan Childrens Comment : అనాథ పిల్ల‌లు ప్ర‌భుత్వ బిడ్డ‌లు

Leave A Reply

Your Email Id will not be published!