Jayasudha Confirm : జ‌య‌సుధ‌కు సీటు క‌న్ ఫ‌ర్మ్

అందుకే బీజేపీలో జాయినింగ్

Jayasudha Confirm : తెలంగాణ రాజ‌కీయాల‌లో జంపింగ్ జపాంగ్ లు ఎక్కువై పోయారు. ఎవ‌రు ఏ పార్టీలో ఉంటారో చెప్ప‌డం క‌ష్టంగా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి , కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారుతున్నారు. కండువాలు కప్పేసుకుంటున్నారు. గ్లామ‌ర్ మెరుగులు బీజేపీకి అద‌న‌పు బ‌లంగా మార‌బోతున్నాయి. ఇప్ప‌టికే బీజేపీలో సినిమా రంగానికి చెందిన వారు ఉన్నారు. విజ‌య శాంతి, జీవిత రాజ‌శేఖ‌ర్ తో పాటు బాబు మోహ‌న్ కూడా ఉన్నారు.

Jayasudha Confirm BJP

వీరిలో ముగ్గురికి క‌న్ ఫ‌ర్మ్ అయిన‌ట్టు టాక్. విజ‌య శాంతికి మెద‌క్, బాబు మోహ‌న్ కు ఆందోళ్ , జ‌య‌సుధ‌(Jayasudha)కు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌లో పోటీ చేసే విధంగా పార్టీ హై క‌మాండ్ ఇప్ప‌టికే డిసైడ్ అయిన‌ట్లు టాక్.

ఇక స‌హ‌జ న‌టిగా జ‌య‌సుధకు మంచి పేరుంది. ఆమె త‌ల్లి పాత్ర‌ల‌కు న్యాయం చేస్తూ వ‌చ్చారు. ఆ మ‌ధ్య‌న క్రిస్టియ‌న్ మ‌తం పుచ్చుకున్నారు. ఓ ట్ర‌స్టు కూడా ఏర్పాటు చేశారు. ఇదే స‌మ‌యంలో గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2009 నుంచి 2014 దాకా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉన్న‌ట్టుండి త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు.

ఆమెకు ఇద్ద‌రు కొడుకులు ఉన్నారు. ప్ర‌స్తుతం టికెట్ క‌న్ ఫ‌ర్మ్ కావ‌డంతో త‌ను బీజేపీలో చేరిన‌ట్లు బ‌య‌ట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎలాంటి వివాదాల జోలికి వెళ్ల‌ని న‌టిగా గుర్తింపు పొందారు జ‌య‌సుధ‌.

Also Read : BJP Focus List : బీజేపీ అభ్య‌ర్థుల‌పై ఉత్కంఠ

Leave A Reply

Your Email Id will not be published!