Shubman Gill : శుబ్ మన్ గిల్ ప్రేమాయణం పై వస్తున్న రూమర్లపై స్పందించిన నటి రిథిమా

ప్రముఖ మోడల్, హిందీ నటి రిద్ధిమా పండిట్‌తో గిల్ ప్రేమలో పడ్డాడని వినిపిస్తోంది...

Shubman Gill : క్రికెటర్లకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుంది. అందునా లవ్ లైఫ్, మ్యారేజ్ లాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలని అభిమానులు బాగా ఆసక్తి చూపిస్తుంటారు. ప్లేయర్లు ఎవరితో ప్రేమాయణం నడిపిస్తున్నారు? ఎవర్ని పెళ్లాడబోతున్నారు? లాంటివి తెలుసుకోవాలని క్రికెట్ లవర్స్‌తో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అందుకే అలాంటి న్యూస్ బయటకు వస్తే తెగ వైరల్ అవుతుంది. అలాంటి ఓ వార్తే నెట్టింట చక్కర్లు కొడుతోంది. టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) ఓ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. ఎవరా అందాల భామ? వీళ్ల లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది?

Shubman Gill Love Story..

ప్రముఖ మోడల్, హిందీ నటి రిద్ధిమా పండిట్‌(Ridhima Pandit)తో గిల్ ప్రేమలో పడ్డాడని వినిపిస్తోంది. వీళ్లిద్దరూ చాన్నాళ్లుగా రిలేషన్‌లో ఉన్నారని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. త్వరలో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కడం ఖాయమని సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. దీంతో గిల్-రిద్ధిమా మ్యారేజ్ ఖాయమని అంతా అనుకుంటున్నారు. ఈ తరుణంలో గిల్‌(Shubman Gill)తో లవ్ అంటూ వస్తున్న పుకార్లపై రిద్ధిమా క్లారిటీ ఇచ్చింది. దీని గురించి ఏం చెప్పాలో తనకు అర్థం కావడం లేదని తెలిపింది. గిల్‌తో తన పెయిర్ బాగుంటుందని అనుకుంటున్నారని.. కానీ అతడితో తనకు అసలు పరిచయమే లేదని స్పష్టం చేసింది. గిల్‌ను ఇప్పటివరకు ఒక్కసారి కూడా కలవలేదని పేర్కొంది.

‘గిల్‌తో నాకు పరిచయమే లేదు. ఒక్కసారి కూడా అతడ్ని కలవలేదు. ఇలాంటి పుకార్లు ఎక్కడి నుంచి వస్తాయో నాకు అర్థం కావడం లేదు. మా ఇద్దరి మధ్య ఏదీ లేదు. కానీ గిల్ ఓ క్రికెటర్‌గా తెలుసు. అతడు టీమిండియా తరఫున మరింత బాగా ఆడాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్’ అని క్లారిటీ ఇచ్చింది రిద్ధిమా. కాగా, గిల్ లవ్ లైఫ్ గురించి గతంలో కూడా పలు రూమర్స్ షికారు చేశాయి. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో అతడు ప్రేమలో ఉన్నట్లు వినిపించింది. ఆ తర్వాత స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ వారసురాలు సారా అలీ ఖాన్‌తో శుబ్‌మన్ లవ్‌లో ఉన్నాడనే పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రిద్ధిమాతో ప్రేమ, పెళ్లి అంటూ రూమర్స్ రాసాగాయి. మరి.. రిద్ధిమా క్లారిఫికేషన్‌తోనైనా వీటికి చెక్ పడుతుందేమో చూడాలి.

Also Read : MLA KTR : మాజీ మంత్రి కేటీఆర్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు

Leave A Reply

Your Email Id will not be published!