Adani Holcim : అతి పెద్ద సిమెంట్ వాటాదారుగా అదానీ గ్రూప్
హోల్సిమ్ ఇండియా ఆస్తుల కొనుగోలు
Adani Holcim : భారత దేశానికి చెందిన వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ గ్రూప్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు రంగాలలో వాటాలు కలిగి ఉండడం లేదా కొనుగోలు చేయడం పనిగా పెట్టుకుంది.
ఆసియాలోనే టాప్ ధనవంతుడిగా ఇప్పటికే పేరొందిన అదానీ తాజాగా హోల్సిమ్ ఇండియా ఆస్తులను కొనుగోలు చేయనున్నారు. భారత దేశ సిమెంట్ రంగంలో 2వ అతి పెద్దదిగా అవతరించింది.
అదానీ గగత రెండేళ్లలో ఓడ రేవులు, పవర్ ప్లాంట్లు, బొగ్గు గనుల నిర్వహణలో కీలకంగా ఉంది. ప్రధాన వాటాదారుగా ఇప్పటికే పేరొందింది. యుఎస్ 10.5 బిలియన్ల ఒప్పందం కుదుర్చుకుంది.
భారత దేశంలోని హోల్సిమ్ లిమిటెడ్ వ్యాపారాలలో నియంత్రణ వాటాను కొనుగోలు చేసేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు గౌతమ్ అదానీ గ్రూప్(Adani Holcim) వెల్లడించింది.
అదానీ గత కొంత కాలం నుంచి పోర్టులు, పవర్ ప్లాంట్లు, బొగ్గు గనులను నిర్వహించే ప్రధాన వ్యాపారానికి మించి విమానాశ్రయాలు, డేటా సెంటర్లు , క్లీన్ ఎనర్జీ సెక్టార్ లోకి ఎంటర్ అయ్యింది.
ఈ గ్రూప్ గత ఏడాది రెండు సిమెంట్ అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. అదానీ సిమెంటేషన్ లిమిటెడ్ గుజరాత్ లోని దహేజ్ , మహారాష్ట్ర లోని రాయ్ ఘర్ లో రెండు సిమెంట్ యూనిట్లను ఏర్పాటు చేయాలని చూస్తోంది.
దీంతో పాటు అదానీ(Adani Holcim) సిమెంట్ లిమిటెడ్ గా ఉంది. ఏసీసీ లిమిటెడ్, అంబూజా సిమెంట్ ల సంయుక్త నియంత్రణను పొందడం ద్వారా బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ రెండో అతి పెద్ద సిమెంట్ వాటాదారుగా చేరారు.
Also Read : పతనం అంచున భారత దేశం