Adani 5G Spectrum Bid : 5జీ స్ప్రెక్టం వేలం పైనే అదానీ ఫోక‌స్

టెలికాం స‌ర్వీసెస్ పై అనాస‌క్తి

Adani 5G Spectrum Bid : భార‌తీయ దిగ్గ‌జ వ్యాపార‌వేత్త‌గా పేరొందిన అదానీ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ గౌతం అదానీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న టెలికాం సెక్టార్ లోకి ప్ర‌వేశిస్తాడ‌ని అంతా అనుకున్నారు.

కానీ టెలికాం స‌ర్వీసెస్ కంటే కేంద్ర స‌ర్కార్ ఆధీనంలో నిర్వ‌హించ‌బోయే 5జీ స్పెక్ట్ర‌మ్ వేలం (Adani 5G Spectrum Bid) పాట‌లోనే పాల్గొనాల‌ని చివ‌ర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు.

దీంతో ఇప్ప‌టి దాకా పోటీదారుగా ఉన్న రిల‌య‌న్స్ జియో, ఎయిర్ టెల్ కంపెనీల‌కు అదానీ గ్రూప్(Adani) నుంచి అత్య‌ధికంగా పోటీ ఎదురు కానుంది.

దీంతో వేలం పాట‌లో మ‌రింత డ‌బ్బులు కేంద్రానికి టెలికాం రూపేణా రావ‌చ్చ‌ని అంచ‌నా. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ ఆస్తుల‌ను గంప‌గుత్త‌గా అమ్మ‌డ‌మో లేదా లీజుకు ఇవ్వ‌డ‌మో చేస్తూ వ‌స్తున్న మోదీ స‌ర్కార్ కు ఇప్పుడు 5జీ స్పెక్ట్ర‌మ్ వేలం బంగారు బాతు గుడ్డు లాంటిదిగా మారింది

. ఇందులో గౌత‌మ్ అదానీ త‌న సంస్థ‌ల‌కు చెందిన వ్యాపారాల‌కు సంబంధించి ప్రైవేట్ నెట్ వ‌ర్క్ ను అందించేందుకు 5జీ స్పెక్ట్ర‌మ్ వేలంలోకి ప్ర‌వేశిస్తున్న‌ట్లు స‌మాచారం.

టెలికాం సేవ‌ల కంటే 5జీనే బెట‌ర్ అని స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలిసింది. ఇదిలా ఉండ‌గా విమానాశ్ర‌యాలు, దాని పోర్టుల వ్యాపారం కోసం ప్రైవేట్ నెట్ వ‌ర్క్ ను అందించేందుకు గాను 5జీ స్పెక్ట్ర‌మ్ వేలం రేసులోకి ప్ర‌వేశిస్తున్న‌ట్లు అదానీ గ్రూప్ ప్ర‌క‌టించింది.

ఇప్ప‌టి దాకా మూడు ప్ర‌ధాన టెలికాం స‌ర్వీసులైన జియో(JIO), ఎయిర్ టెల్ , వొడా ఫోన్ ఐడియా ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు స‌మాచారం.

మ‌రో వైపు టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్ ) 5జీ వేలం కోసం సిఫార్సు చేసిన రిజ‌ర్వ్ ధ‌ర‌ల‌ను గ‌త‌నెల మంత్రివ‌ర్గం ఆమోదించింది.

మొబైల్ సేవ‌ల‌కు గాను ఫ్లోర్ ధ‌ర‌ను 40 శాతం త‌గ్గించాల‌ని ట్రాయ్ సూచించింది.

Also Read : మ‌స్క్ నిర్ణ‌యం ట్విట్ట‌ర్ ఉద్యోగులు ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!