Adhir Ranjan Chowdhury : స్మృతీ ఇరానీ క్షమాపణలు చెప్పాలి
కేంద్ర మంత్రిపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ ఎంపీ
Adhir Ranjan Chowdhury : కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను టార్గెట్ చేస్తూ బద్నాం చేసేందుకు యత్నించిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీపై నిప్పులు చెరిగారు.
బేషరతుగా రాష్ట్రపతికి ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి , ఎంపీ మధ్య గత కొన్ని రోజుల నుంచి తీవ్ర వాగ్వావాదం చోటు చేసుకుంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి రాష్ట్రపత్ని అని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసింది బీజేపీ. కేంద్ర మంత్రులు ఆందోళన చేపట్టారు.
రెండు సార్లు లోక్ సభ వాయిదా పడింది. చివరకు దిగి వచ్చారు ఎంపీ అధీర్ రంజన్(Adhir Ranjan) చౌదరి. తాను అలా అనలేదని, ఒకవేళ మనసు నొప్పిస్తే ద్రౌపది ముర్ముకు క్షమాపణలు చెబుతానని కానీ బీజేపీ మంత్రులు, ఎంపీలకు కాదని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఎంపీ తరపున కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.
ఈ మేరకు క్షమాపణలు చెబుతూ సుదీర్ఘ లేఖ రాశారు అధీర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు. తాజాగా అధీర్ రంజన్ చౌదరి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు మరో లేఖ రాశారు.
కేంద్ర మంత్రి ద్రౌపది ముర్ము అని సంబంధించారని ప్రెసిడెంట్ అని పేర్కొన లేదని ఆరోపించారు. వెంటనే రాష్ట్రపతికి బేషరతుగా స్మృతీ ఇరానీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అధీర్ రంజన్ చౌదరి.
Also Read : సల్మాన్ ఖాన్ కు ఆయుధాల లైసెన్స్