Aditi Gupta : రుతుక్ర‌మంపై ‘అదితి’ అవ‌గాహ‌న‌

మెన్‌స్ట్రుపీడియా కో ఫౌండ‌ర్ 

Aditi Gupta : ఎవ‌రీ అదితి గుప్తా అనుకుంటున్నారా. స‌భ్య స‌మాజంలో ప్ర‌ధానంగా భార‌త దేశంలో ప్ర‌తి నెల నెలా వ‌చ్చే రుతుక్ర‌మం (మెన్సెస్ ) గురించి అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నానికి శ్రీ‌కారం చుట్టారు.

ఆమె స్వ‌త‌హాగా ర‌చ‌యిత్రి. అంతే కాదు కామిక్ మెన్ స్ట్రుపీడియా కో ఫౌండ‌ర్ కూడా. మెన్సెస్ పట్ల అపోహ‌లు, త‌ప్పుడు స‌మాచారంతో విసిగి పోయిన బాధితుల‌లో మార్పు కోసం త‌న బాధ్య‌త‌ను స్వీక‌రించింది.

ఆమె తో పాటు భ‌ర్త కూడా క‌లిసి 2012లో కామిక్ ను స్థాపించారు. 2014లో అదితి గుప్తా నిషిద్ధాన్ని ఛేదించ‌డంలో ఆమె చేసిన కృషికి గాను ఫోర్బ్స్ ఇండియా 30 అండ‌ర్ 30 జాబితాలో చోటు క‌ల్పించింది.

మెన్ స్ట్రుపీడియా 6 వేల కంటే ఎక్కువ పాఠ‌శాల‌ల్లో ఉప‌యోగిస్తున్నారు. 14 భాష‌ల్లో 10 ల‌క్ష‌ల మంది బాలిక‌ల‌కు ఇది ప్ర‌యోజ‌నం చేకూరింది. అదితి గుప్తా (Aditi Gupta)భార‌త దేశంలో ఒక సామాజిక మ‌హిళా వ్యాపార‌వేత్త‌.

రుతుక్ర‌మం గురించి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఆమె ప‌లు మాధ్య‌మాల ద్వారా ప్ర‌సంగించారు. మెన్సెస్ అన్న‌ది త‌ప్పు కాద‌ని దాని ప‌ట్ల అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని చైత‌న్య‌వంతం చేస్తున్నారు.

ప్ర‌పంచ వేదిక‌లైన టెడ్ టాక్ , ది వాల్ స్ట్రీట్ జ‌న‌ర‌ల్ , రాయిట‌ర్స్ , సీఎన్బీసీ, బీబీసీల‌లో క‌నిపించారు అదితి గుప్తా. ఆమె చేస్తున్న ప్ర‌య‌త్నం ఎంద‌రికో మేలు చేకూర్చుతోంది.

అస‌లు మెన్ స్ట్రుపీడియా అంటే ఏమిటంటే దేశంలోని 30 కంటే ఎక్కువ పాఠ‌శాల‌ల్లో బోధించే పీరియ‌డ్స్ ల గురించి పూర్తి గైడ్. 2012లో దీనిని స్థాపించారు.

Also Read : ధిక్కార స్వ‌రం ‘శోభ‌’క్క ప్ర‌స్థానం

Leave A Reply

Your Email Id will not be published!