Aditi Deshmukh Farming : సేంద్రీయం ‘అదితి’ విజ‌యం

ఆయుర్వేద జీవ‌న విధానంతో స‌క్సెస్

Aditi Deshmukh Farming : టెక్నాల‌జీ పెరిగింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఆరోగ్యం ప‌ట్ల మ‌క్కువ కూడా ఎక్కువ‌వుతోంది. దీంతో పురుగు మందులు లేని, రసాయ‌నాలు వాడ‌ని ఆహారం, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ప‌ట్ల అవ‌గాహ‌న పెంచుకుంటున్నారు.

దీంతో సేంద్రీయ వ్య‌వ‌సాయానికి ప్ర‌యారిటీ పెరిగింది. దీనికి దైనందిన జీవితంలో ఒక భాగంగా మారిన ఆయుర్వేదాన్ని కూడా జ‌త చేస్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌కు ప్రాణం పోశారు అదిది దేశ్ ముఖ్. ప్ర‌స్తుతం ఆమె సాధించిన ఈ స‌క్సెస్ ఎంద‌రికో స్పూర్తి దాయ‌కంగా మారుతోంది.

బెంగ‌ళూరులోని ఇంటి చుట్టూ ఉన్న పొలాల నుండి తాజా పండ్లు, కూర‌గాయ‌లును పెంచేలా చేసింది. త‌న పిల్ల‌ల‌కు కూడా వీటినే అంద‌జేసింది. సేంద్రీయ వ్య‌వ‌సాయాన్ని ఒక పండుగ‌లా చేసేలా ఫార్మ్ టు టేబుల్ వెంచ‌ర్ ను ఏర్పాటు చేసేలా ఉసిగొల్పింది.

క‌రోనా క‌ష్ట కాలంలో ఈ సాగు మ‌రింత తోడ్పాటు అందించేలా చేయ‌డం విశేషం. మ‌ట్టి వాతావ‌ర‌ణ ప‌రిస్థితులకు అనుగుణంగా ఆయుర్వేద ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేసేలా ప్లాన్ చేసింది. అశ్వ గంధ ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌ని తెలుసుకుంది.

బెంగ‌ళూరు కాస్మోపాలిట‌న్ వాతావ‌ర‌ణంలో త‌న త‌ల్లి, అమ్మ‌మ్మ వంటి వారి మార్గ‌ద‌ర్శ‌క‌త్వం త‌న‌ను వ్యాపార‌వేత్త‌గా రాణించేలా చేసిందంటారు అదితి దేశ్ ముఖ్(Aditi Deshmukh Farming). ఆమె చిన్న‌త‌నం నుంచి పొలాల మ‌ధ్య పెరిగింది.

పొలం నుండి నేరుగా తాజా పండ్లు, కూర‌గాయ‌లు ఆహారంలో భాగంగా మార్చేలా చేసుకున్నారు. బెంగ‌ళూరులోని లాటూర్ లో స్వంతంగా వ్య‌వ‌సాయ భూమిని క‌లిగి ఉన్నారు. సేంద్రీయ ఉత్ప‌త్తి వెంచ‌ర్ ను ప్రారంభించ‌డ‌మే కాదు విజ‌య‌వంత‌మైన మ‌హిళా వ్యాపార‌వేత్త‌గా గుర్తింపు పొందారు.

Also Read : ఆగ్రో టెక్నాల‌జీలో ప‌ల్ల‌వి సింగ్ అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!