ADR Himachal Report : బ‌రిలో నిలిచిన వారిలో ‘బ‌డా’ బాబులే

కాంగ్రెస్ లో 90 శాతం బీజేపీలో 82 శాతం

ADR Himachal Report : దేశంలో ఉప ఎన్నిక‌లు ముగిశాయి. ఆరు రాష్ట్రాల‌లో 7 నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఫ‌లితాలు వ‌చ్చాయి. ఎప్ప‌టి లాగే బీజేపీ స‌త్తా చాటింది. తాజాగా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అసెంబ్లీ ఎన్నిక‌లు గుజ‌రాత్ , హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో కొన‌సాగుతున్నాయి. ప్ర‌ధాన పార్టీలు ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి.

ఇక హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో పోటీ చేస్తున్న కాంగ్రెస్, భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎమ్మెల్యేల‌లో 90 శాతానికి పైగా కోటీశ్వ‌రులే క‌లిగి ఉండ‌డం విశేషం. ఓ వైపు ప్ర‌జ‌లు అన్న‌మో రామ‌చంద్ర అంటూ ఆకలి కేక‌ల‌తో అల్లాడుతుంటే పార్టీలు మాత్రం అంత‌కంత‌కూ క‌రోడ్ ప‌తుల‌ను పెంచి పోషిస్తున్నాయి.

ఇక హిమాచ‌ల్ ప్ర‌దేశ్ 2022 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 90 శాతం మంది కాంగ్రెస్ కు చెందిన అభ్య‌ర్థులు కోటీశ్వ‌రులుగా ఉన్న‌ట్లు తేలింది. ఇక అందుకు తామేమీ తీసిపోమంటూ అధికారంలో ఉన్న బీజేపికి చెందిన ఎమ్మెల్యేలు 82 శాతం మంది కోటీశ్వ‌రులు ఉండ‌డం విశేషం. మొత్తం 412 మంది పోటీలో ఉండ‌గా వీరిలో స‌గానికి పైగా 55 శాతం 226 మంది అభ్య‌ర్థులు కోటీశ్వ‌రులుగా తేలింది.

ఈ విష‌యాన్ని అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్ )(ADR Himachal Report) ప్ర‌క‌టించింది. 68 స్థానాల్లో 67 స్థానాల్లో నిలిచిన ఆప్ లో 35 మంది కోటీశ్వ‌రులు ఉన్నారు. బీఎస్పీ 53 స్థానాల‌లో పోటీ చేస్తుండ‌గా ఇందులో 13 మంది కోటీశ్వ‌రులు ఉన్నారు.

సీపీఎం నుంచి న‌లుగురు ఉండ‌గా 45 మంది ఇండిపెండెంట్లు కోటీశ్వ‌రులే ఉండ‌డం విచిత్రం. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 61 మంది అభ్య‌ర్థులు, బీజేపీకి సంబంధించి 56 మంది క‌రోడ్ ప‌తులు ఉన్నారు.

ప్ర‌స్తుతం విడుద‌ల చేసిన ఏడీఆర్ రిపోర్ట్ క‌ల‌క‌లం రేపుతోంది రాష్ట్రంలో.

Also Read : గ్రానైట్ దందాలో హ‌వాలా నిజం – ఈడీ

Leave A Reply

Your Email Id will not be published!