Afghan Team Win : పాక్ పై విజయం ఆఫ్గాన్ ఆనందం
8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ
Afghan Team Win : ఐసీసీ వరల్డ్ కప్ లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన కీలక పోరులో బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ జట్టును మట్టి కరిపించింది ఆఫ్గనిస్తాన్. ఇది ఊహించని షాక్ కు గురి చేసింది. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఆఫ్గాన్ టీం. దీంతో జట్టు మొత్తం ఫుల్ జోష్ లో మునిగి పోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది ఆఫ్గనిస్తాన్ టీం.
Afghan Team Win Viral
తన ప్రత్యర్థి పాకిస్తాన్ కు చుక్కలు చూపించి గ్రాండ్ విక్టరీ నమోదు చేసిన ఆఫ్గనిస్తాన్ జట్టుకు క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం అభినందనలతో ముంచెత్తారు. ఇక ఆఫ్గనిస్తాన్(Afghanistan) దేశ ప్రజలు, అక్కడి సర్కార్ సైతం జట్టును ప్రశంసలతో ముంచెత్తింది.
ఇదిలా ఉండగా తాజాగా వన్డే వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్ లలో వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించింది ఆఫ్గనిస్తాన్ జట్టు. బలమైన ఇంగ్లండ్ కు బిగ్ షాక్ ఇచ్చింది. నెదర్లాండ్ ను ఓడించింది తొలి మ్యాచ్ లో.
ఇక మ్యాచ్ పరంగా చూస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 283 రన్స్ చేసింది. కేవలం ఆఫ్గనిస్తాన్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 286 పరుగులు చేసింది. 8 వికెట్ల తేడాతో షాక్ ఇచ్చింది.
Also Read : MLA Jagga Reddy : పదేళ్లలో సీఎం అవుతా – జగ్గారెడ్డి