Afghanistan Team Comment : ప‌సి కూన‌లు కాదు ఆఫ్గాన్ పులులు

ఆఫ్గాన్ జ‌ట్టు వెనుక ఆ ఇద్ద‌రు

Afghanistan Team Comment  : అద్భుతాల‌కు పెట్టింది పేరు క్రీడా రంగం. అందుకే ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆట‌ల‌ను ప్రేమిస్తారు. వాటిని త‌మ‌దిగా భావిస్తారు. వారే ఆడుతున్న‌ట్లుగా క‌ల‌ల్లో తేలి యాడతారు. ఈ లోకంలో ఎక్కువ‌గా ప్ర‌భావితం చేసేవి రెండే రెండు ఒక‌టి సినిమా రెండు ఆట‌లు. ప్ర‌త్యేకించి వ‌ర‌ల్డ్ వైడ్ గా చూస్తే టెన్నిస్, పుట్ బాల్, వాలీ బాల్, క్రికెట్. ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు టాప్ త్రీలో కొన‌సాగుతోంది క్రికెట్.

ఒకప్పుడు జెంటిల్మెన్ ఆట‌గా భావించే వారు. కానీ సీన్ మారింది. టెక్నాల‌జీ తోడైంది. ఆట‌కు వ్యాపార రంగం తోడైంది. కోట్లు కురిపించేలా మారి పోయింది. ఎక్క‌డ చూసినా క్రికెట్టే. అంతెందుకు టెన్నిస్, ఫుట్ బాల్ కు ప్ర‌యారిటీ ఇచ్చే అమెరికా సైతం ఇప్పుడు క్రికెట్ జ‌పం చేస్తోంది. దీనికి ఉన్నంత క్రేజ్ మ‌రే దానికి లేకుండా పోతోంది. ఇక ఇప్పుడు ప్ర‌పంచ క్రికెట్ రంగాన్ని భార‌త దేశం శాసిస్తోంది. బీసీసీఐ అత్య‌ధిక ఆదాయం క‌లిగిన క్రీడా సంస్థ‌గా పేరు పొందింది. ఇక భార‌త్ త‌న దైన శైలిలో నిత్యం తుపాకుల మోత‌తో ద‌ద్ద‌రిల్లే ఆఫ్గ‌నిస్తాన్(Afghanistan) ను ఆద‌రించింది. ఆ దేశానికి చెందిన ఆట‌గాళ్ల‌ను త‌మ‌లో ఒక‌రిగా చేర్చుకుంది.

Afghanistan Team Comment Viral

క్రికెట్ కు కులం, మ‌తం, ప్రాంతం, దేశం, స‌రిహ‌ద్దుల‌తో ప‌ని లేదంటూ చాటి చెప్పింది. ఒక‌ప్పుడు ప‌సి కూన‌లుగా భావించిన ఆఫ్గ‌నిస్తాన్ జ‌ట్టు ఇవాళ యావ‌త్ ప్ర‌పంచం విస్తు పోయేలా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంటోంది. భార‌త్ లో బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో ఊహించ‌ని రీతిలో విజ‌యాలు న‌మోదు చేసింది. బ‌ల‌మైన జ‌ట్ల‌ను మ‌ట్టి క‌రిపించింది ఆఫ్గ‌నిస్తాన్ జ‌ట్టు. ఒక‌టా రెండా ఏకంగా వ‌రుస‌గా గెలుస్తూ త‌న‌కు ఎదురే లేద‌ని చాటింది. సెమీస్ ఆశ‌లు స‌జీవంగా ఉంచుకుంది. ఆఫ్గ‌నిస్తాన్(Afghanistan) ఇప్పుడు అన్ని రంగాల‌లో అగ్ర‌గామిగా ఉంది. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో , ఫీల్డింగ్ లో మొత్తంగా స‌మిష్టిగా జ‌ట్టు ఆడుతోంది. టోర్నీలో నెద‌ర్లాండ్, మాజీ ఛాంపియ‌న్ ఇంగ్లండ్, బ‌ల‌మైన పాకిస్తాన్ , దాయాది శ్రీ‌లంక జ‌ట్ల‌కు చుక్క‌లు చూపించింది. భారీ తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది.

మ‌రి ఇదంతా ఎలా సాధ్య‌మైంద‌నే అనుమానం రాక త‌ప్ప‌దు. దీని వెనుక భార‌త క్రికెట్ జ‌ట్టుకు చెందిన మాజీ క్రికెట‌ర్ అజ‌య్ జ‌డేజా ఉన్నాడు. అత‌డు ఎప్పుడైతే ఆఫ్గాన్ కు మెంటార్ గా వెళ్లాడో కీల‌క‌మైన మార్పులు తీసుకు వ‌చ్చాడు. జ‌ట్టులో ఆత్మ విశ్వాసం నెల‌కొల్పాడు. గెలుపు సాధించేందుకు కావాల్సిన ఆయుధాల‌ను అందించాడు. నిత్యం వారిలో స్పూర్తి నింపాడు. మీరు విజ‌యం సాధిస్తే ఆఫ్గ‌నిస్తాన్ దేశం గెలుపొందిన‌ట్టు భావించాల‌ని బోధించాడు. వారిలో చైత‌న్యం నింపాడు.

దేశం ప‌ట్ల మ‌రింత న‌మ్మ‌కాన్ని, అంత‌కు మించిన ప్రేమ‌ను, గౌర‌వాన్ని క‌లిగించేలా చేశాడు. జ‌డేజా ఎవ‌రో కాదు భార‌త క్రికెట్ జ‌ట్టుకు ఎన‌లేని విజ‌యాలు చేకూర్చి పెట్టిన మాజీ కెప్టెన్ మ‌హ‌మ్మ‌ద్ అజాహ‌రుద్దీన్ స‌హ‌చ‌రుడు. క‌ష్టాలు వ‌చ్చినా స‌రే దాటుకుని ఎలా ముందుకు వెళ్లాలో నేర్పించాడు. అత‌డికి ప్ర‌ధాన కోచ్ జోనాథ‌న్ కూడా తోడ‌య్యాడు. ఇంకేం ప్ర‌పంచం యావ‌త్తు ఆఫ్గాన్ ఆట‌గాళ్ల వైపు చూసేలా తయారు చేశారు. ప్ర‌పంచ క‌ప్ లో నెగ్గినా నెగ్గ‌క పోయినా జ‌ట్టు చేసిన అద్భుతాలు మాత్రం చిర‌కాలం గుర్తుండి పోతాయి. ఏది ఏమైనా ఆట దేశాన్ని క‌లుపుతుందనేది వీరి గెలుపును చూస్తే అర్థ‌మ‌వుతుంది.

Also Read : CM KCR Visit : వీర తిల‌కం విజ‌యం త‌థ్యం

Leave A Reply

Your Email Id will not be published!