Gunturu Karam : గుంటూరు కారం ఫ‌స్ట్ సింగిల్

అప్ డేట్ ఇచ్చిన సినీ నిర్మాత

Gunturu Karam : మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రిన్స్ మ‌హేష్ బాబు, శ్రీ‌లీల‌, మీనాక్షి చౌద‌రి క‌లిసి న‌టిస్తున్న గుంటూరు కారం పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు పోస్ట‌ర్స్ మాత్ర‌మే విడుద‌ల చేసిన మూవీ మేక‌ర్స్ తాజాగా కీల‌క అప్ డేట్ ఇచ్చారు. ఫ‌స్ట్ సింగ్ ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Gunturu Karam Updates

ఇందుకు సంబంధించి సినిమా నిర్మాత జ‌స్ట్ హింట్ ఇచ్చారంతే. ట్విట్ట‌ర్ వేదిక‌గా తేదీ పెట్టారు. అంటే అర్థం గుంటూరు కారం(Gunturu Karam) చిత్రానికి సంబంధించి ఫ‌స్ట్ సింగిల్ రాబోతున్న‌ట్లు టాక్. మొత్తంగా త్రివిక్ర‌మ్ మూవీ అంటేనే అంచ‌నాలు ఓ రేంజ్ లో ఉంటాయి.

త‌న సినిమాలో క‌థ‌తో పాటు డైలాగులు డామినేట్ చేస్తాయి. ఒక ర‌కంగా జీవితానికి స‌రిప‌డా, సమాజాన్ని ప్ర‌భావితం చేసేలా ఉంటాయి. ఆయ‌న ఇటీవ‌ల బ‌న్నీతో తీసిన అల వైంకుంఠ‌పురంలో సూప‌ర్ స‌క్సెస్. అంత‌కు ముందు మ‌హేష్ బాబుతో రెండు సినిమాలు తీశాడు. ఒక‌టి అత‌డు రెండోది ఖ‌లేజా. ఇప్పుడు మూడోది గుంటూరు కారం.

కాగా కారం అనేస‌రిక‌ల్లా ముందుగా గుర్తుకు వ‌చ్చేది గుంటూరు మిర‌ప‌కాయ‌లు గుర్తుకు వ‌స్తాయి. మ‌రి సినిమా కారంగా ఉంటుందా లేక దానికంటే భిన్నంగా ఉంటుందా అనేది వేచి చూడాలి.

Also Read : Afghanistan Team Comment : ప‌సి కూన‌లు కాదు ఆఫ్గాన్ పులులు

Leave A Reply

Your Email Id will not be published!