Shoaib Akhtar : వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత కోహ్లీ ఆడేది క‌ష్ట‌మే

పాకిస్తాన్ మాజీ పేస‌ర్ షోయ‌బ్ అక్త‌ర్

Shoaib Akhtar : పాకిస్తాన్ మాజీ పేస‌ర్ షోయ‌బ్ అక్త‌ర్(Shoaib Akhtar) షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో మోస్ట్ పాపుల‌ర్ ఆట‌గాడిగా పేరుంది విరాట్ కోహ్లీకి. గ‌త మూడేళ్లుగా ప‌రుగుల కోసం నానా తంటాలు ప‌డ్డాడు.

అత‌డి పేరు మీద ఎన్నో రికార్డులు ఉన్నాయి. సుదీర్గ కాలం త‌ర్వాత యూఏఈ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ లో రాణించాడు. ఓ సెంచ‌రీ కూడా న‌మోదు చేశాడు. మాజీ ఆటగాళ్లు కొంద‌రు అది ఓ సెంచ‌రీనేనా అన్న కామెంట్స్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

త‌న కెరీర్ లో 71వ అంత‌ర్జాతీయ సెంచ‌రీ కొట్టాడు. టోర్నీలో రెండో అత్య‌ధిక ప‌రుగుల స్కోర‌ర్ గా నిలిచాడు. ఐదు మ్యాచ్ ల‌లో రెండు హాఫ్ సెంచ‌రీలు ఒక సెంచ‌రీతో 276 ప‌రుగులు చేశాడు.

అయితే కోహ్లీ ఆట తీరుకు ఈ ర‌న్స్ త‌క్కువేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఒకానొక ద‌శ‌లో టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఎంపిక అవుతాడో లేదోన‌న్న అనుమానం కూడా క‌లిగింది.

వాట‌న్నింటిని ప‌టాపంచ‌లు చేస్తూ రాణించాడు. అయితే కోహ్లీని కేవ‌లం వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కే ప‌రిమితం చేస్తార‌ని ఆ త‌ర్వాత అత‌డిని పక్క‌న పెట్టే ఆలోచ‌న‌లో బీసీసీఐ(BCCI) ఉంద‌ని స‌మాచారం.

దీనికి ఊత‌మిస్తూ పాకిస్తాన్ మాజీ పేస‌ర్ షోయబ్ అక్త‌ర్ బాంబు పేల్చాడు. టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత కోహ్లీ ఆడేది అనుమానమేన‌ని పేర్కొన్నాడు. పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్ప‌నున్న‌ట్లు తెలిపాడు.

ఆశించిన మేర రాణించ‌డం లేద‌ని తెలిపాడు షోయ‌బ్ అక్త‌ర్(Shoaib Akhtar). కాగా ఇప్ప‌టి వ‌ర‌కు కోహ్లీ మూడు ఫార్మాట్ ల‌కు క‌లిపి 104 మ్యాచ్ లు ఆడాడు. 51.94 స‌గ‌టుతో 3,548 ర‌న్స్ టి20 మ్యాచ్ ల‌లో చేశాడు.

Also Read : టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విండీస్ టీమ్

Leave A Reply

Your Email Id will not be published!