AG Perarivalan : అలుపెరుగ‌ని పోరాటం అమ్మ‌కు వంద‌నం

ఆమె చేసిన త్యాగం వెల‌క‌ట్ట‌లేనిది

AG Perarivalan : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన మాజీ ప్ర‌ధాన మంత్రి రాజీవ్ గాంధీ పేలుడు ఘ‌ట‌న‌లో దోషిగా ఉన్న ఏజీ పెరారివాల‌న్ (AG Perarivalan) 31 ఏళ్ల సుదీర్ఘ శిక్ష అనంత‌రం బెయిల్ పై విడుద‌ల‌య్యారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జైలు శిక్ష అనేది అంతిమం కాద‌ని, అనేకానేక స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూప‌లేద‌న్నారు. ద్ర‌విడ ఉద్య‌మనేత పెరియార్ ఫాలోవ‌ర్ గా ఉన్నారు పెరారివాలన్.

ఆయ‌న జైలులో నుంచే ఇందిరా గాంధీ ఓపెన్ యూనివ‌ర్శిటీ నుంచి డిగ్రీ, పీజీ లో కంప్యూట‌ర్స్ చ‌దివారు. ఆపై రాజీవ్ గాంధీ హ‌త్య దాని

వెనుక ఉన్న నిజాలు ఏమిట‌నే దానిపై ఓ పుస్త‌కాన్ని రాశారు.

దీనిని బ‌ర్ద‌న్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఏజి పెరారివాల‌న్(AG Perarivalan) త‌న కోసం త‌న త‌ల్లి చేసిన పోరాటం గొప్ప‌ద‌న్నారు.

ఆమె చేసిన ఉద్య‌మం, త్యాగం గొప్ప‌ద‌న్నారు.

ఇది ఎంతో మంది త‌ల్లుల‌కు స్పూర్తిగా నిలుస్తంద‌న్నారు. రాజీవ్ హ‌త్య కేసులో దోషిగా తేల‌డంతో కోర్టు మ‌ర‌ణ శిక్ష విధించింది. క్ష‌మాభిక్ష

కోర‌డంతో జీవిత ఖైదుగా మార్చారు.

జైలులో ప్ర‌వ‌ర్త‌న‌, ఆయ‌న చ‌దివిన తీరు, వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న తీర్పు చెప్పింది.

ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు వెలువ‌రించింది.

దీనిని కాంగ్రెస్ పార్టీ త‌ప్పు ప‌ట్టింది. 74 ఏళ్ల అరుపుత‌మ్మాళ్ త‌న కొడుకును విడిపించేందుకు ద‌శాబ్దాలుగా క‌ష్ట‌త‌ర‌మైన న్యాయ పోరాటాన్ని కొన‌సాగించింది. పెరారివాల‌న్ త‌న త‌ల్లి గురించి గొప్ప‌గా చెప్పాడు.

ఆమె అనేక అవ‌మానాల‌ను ఎదుర్కొంది. వేద‌న‌ను అనుభ‌వించింది. ఇంత జ‌రిగినా త‌ను మాత్రం ప‌ట్టు వీడ‌లేదు. 30 ఏళ్ల పాటు నన్ను విడిపించేందు కోసం పోరాడింద‌న్నారు. అన్ని పార్టీల‌ను క‌లిసింది.

ఢిల్లీ లోని న్యాయ‌వాదుల‌ను క‌లిసింది. కొన్నేళ్లుగా దివంగ‌త సీఎం కుమారి జ‌య‌ల‌లిత‌, మాజీ సీఎం కె. ప‌ళ‌ని స్వామి, మాజీ గ‌వ‌ర్న‌ర్ బ‌న్వ‌రీలాల్ పురోహిత్, ప్ర‌స్తుత సీఎం ఎంకే స్టాలిన్ , కేంద్ర హోం మంత్రి అమిత్ షా , త‌దిత‌ర నాయ‌కుల‌ను క‌లిసింది.

Also Read : పూల‌మ్మింది పీహెచ్‌డీ చ‌దువుతోంది

Leave A Reply

Your Email Id will not be published!