Aha Tamil OTT : ఆహా ఇక త‌మిళంలో సైతం

ఆవిష్క‌రించిన సీఎం స్టాలిన్

Aha Tamil OTT  : తెలుగు వారి లోగిళ్ల‌లో జ‌నాద‌ర‌ణ పొందిన ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా (Aha Tamil OTT )త‌న వ్యాపారాన్ని విస్త‌రించే ప‌నిలో ప‌డింది. త‌మిళ‌నాడుతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న త‌మిళుల‌కు మ‌రింత వినోదాన్ని, సంతోషాన్ని పంచేందుకు ఆహా త‌మిళ్ ఎంట‌రైంది.

ఆహా 100 శాతం వినోదాన్ని అందించేందుకు గాను త‌మిళంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ (Aha Tamil OTT )ను త‌మిళ ఉగాద‌ది సంద‌ర్భంగా సీఎం ఎంకే స్టాలిన్ ఆవిష్క‌రించారు. నిర్మాత అల్లు అర‌వింద్ సార‌థ్యంలో జూపల్లి రామేశ్వ‌ర్ రావు క‌లిసి ఆహాను నిర్వ‌హిస్తున్నారు.

ఇందులో వెబ్ సీరీస్ , మూవీస్ తో పాటు షార్ట్ ఫిలింలు ప్ర‌సారం చేస్తున్నారు. తెలుగు ఐడల్ కూడా చేప‌ట్టారు. ప్ర‌స్తుతం తెలుగు వినోద రంగంలో టాప్ లో క‌న‌సాగుతోంది ఆహా.

ఇప్ప‌టికే నెట్ ఫిక్స్ , అమెజాన్ ప్రైమ్ వీడియో, త‌దిత‌ర సంస్థ‌లు ఉన్న‌ప్ప‌టికీ ఆహా మాత్రం టాప్ లో ఉంటోంది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం స‌క్సెస్ ఫుల్ నిర్మాత అల్లు అర‌వింద్ ఉండ‌డ‌మే.

తెలుగులో స‌క్సెస్ కావ‌డంతో త‌మిళంలో బిజినెస్ ఉంద‌ని గ్ర‌హించిన అల్లు అర‌వింద్ క‌న్ను అక్క‌డ ప‌డింది. ఇంకేం త‌మిళ్ ఆహా ఓటీటీకి శ్రీ‌కారం చుట్టారు.

దీనిని త‌మిళంలో నెంబ‌ర్ వ‌న్ ప్లేస్ లో నిల‌బెట్టాల‌న్న‌దే త‌మ ఆశ‌య‌మ‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు అల్లు అర‌వింద్. సినిమాలు, వెబ్ సీరీస్, టాక్ షోల‌తో వ‌ర‌ల్డ్ వైడ్ గా త‌మిళ‌ల‌కు వినోదాన్ని అందిస్తామ‌న్నారు.

న‌టుడు శింబు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ను బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా నియ‌మించారు. ఆహా త‌మిళ్ ను స్టాలిన్ ఆవిష్క‌రించారు.

Also Read : ఉజ్వల్ కుల్‌కర్ణి బుల్లెట్ లాంటోడు

Leave A Reply

Your Email Id will not be published!