Ahmedabad Time : అహ్మదాబాద్ కు అరుదైన గౌరవం
టైమ్ 50 నగరాలలో చోటుపై షా సంతోషం
Ahmedabad Time : దేశంలోని అహ్మదాబాద్ నగరానికి అరుగైన గౌరవం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన అమెరికాకు చెందిన టైమ్(Time) పత్రిక గొప్ప ప్రదేశాల జాబితాలో అహ్మదాబాద్ ను చేర్చింది.
మొత్తం వరల్డ్ వైడ్ గా టాప్ 50 నగరాలను ఎంపిక చేసింది. అందులో ఇండియాలోని గుజరాత్ రాష్ట్రానికి చెందిన అహ్మదాబాద్ చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంతోషం వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ నగరానికి ఎనలేని, ఘనమైన చరిత్ర ఉందని తెలిపారు.
ప్రపంచంలోనే అత్యుత్తమమైన సిటీలలో అహ్మదాబాద్(Ahmedabad) ఎంపిక కావడం తనకే కాదు రాష్ట్ర ప్రజలకు, నగర వాసులకు, భారతీయులకు గర్వ కారణమని ప్రశంసించారు అమిత్ షా.
భారత దేశపు మొట్ట మొదటి యునెస్కో ప్రపంచ వారసత్వ నగరమైన అహ్మదాబాద్ ఇప్పుడు టైమ్ మ్యాగజైన్ (Ahmedabad Time) ద్వారా ఎంపిక కావడం సంతోషం కలిగిస్తోందన్నారు.
2022లో ప్రపంచంలోని 50 అద్భుతమైన నగరాలలో మనకు చోటు దక్కినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి.
ఈ మేరకు గురువారం అమిత్ షా తన ట్విట్టర్ వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా 2001 నుంచి అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) దూరదృష్టితో కూడిన ఆలోచనలు రాష్ట్రంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు పునాది వేశాయని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి.
Also Read : జమ్మూ కాశ్మీర్ లో దలైలామా పర్యటన