Aiden Markram : ఎయిడెన్‌ మార్క్రమ్ ధ‌నా ధ‌న్

కేకేఆర్ భ‌ర‌తం ప‌ట్టిన క్రికెటర్

Aiden Markram : ఐపీఎల్ 2022 లీగ్ మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ చుక్క‌లు చూపించాడు ఎయిడెన్ మార్క్ర‌మ్(Aiden Markram) . 27 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన ఈ క్రికెట‌ర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. 1994 అక్టోబ‌ర్ 4న పుట్టాడు.

కుడి చేతి వాటం బ్యాట్స్ మెన్. మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ హిట్టర్. అంత‌కు ముందు ఇన్ఫ‌ర్మేష‌న్ టీమ్స్ సౌతాఫ్రికా, సఫారీ అండ‌ర్ -19 , సౌతాఫ్రికా ఇన్విటేష‌న్ XI, టైటాన్స్, సౌతాఫ్రికా ఏ , నెల్స‌న్ మండేలా బే స్టార్స్ డ‌ర్హామ్ , హాంప్ షైర్ , పంజాబ్ కింగ్స్ త‌ర‌పున ఆడాడు.

ప్ర‌స్తుతం ఫిబ్ర‌వ‌రి 12, 13 తేదీల‌లో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ మెగా వేలం పాట‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ సిఇఓ కావ్య మార‌న్ ఏరికోరి తీసుకుంది.

తాజాగా లీగ్ మ్యాచ్ లో భాగంగా జ‌రిగిన మ్యాచ్ లో తుక్కు రేపాడు. ఓ వైపు రాహుల్ త్రిపాఠి దంచి కొడుతుంటే ఇంకో వైపు ఎయిడెన్ మార్క్ర‌మ్(Aiden Markram) స‌త్తా చాటాడు. ఇక ఎయిడెన్ మార్క్ర‌మ్ రెచ్చి పోయాడు.

36 బంతులు ఆడి 6 ఫోర్లు 4 సిక్స‌ర్లు కొట్టాడు. మొత్తం 68 ప‌రుగుల‌తో మెరిశాడు. స‌న్ రైజ‌ర్స్ ను విజ‌య తీరాల‌కు చేర్చాడు. ఇక ఐపీఎల్ లో స్టార్టింగ్ లో ఓట‌మి పాలైనా స‌న్ రైజ‌ర్స్ గాడిన ప‌డింది. మెల మెల్ల‌గా విజ‌యాలు న‌మోదు చేసుకుంటూ ఆస‌క్తిని రేపుతోంది.

డేవిడ్ వార్న‌ర్ ను వ‌ద్ద‌నుకుని న్యూజిలాండ్ స్టార్ ప్లేయ‌ర్ కేన్ విలియ‌మ్స‌న్ కు ప‌గ్గాలు ఇచ్చింది. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోను స‌త్తా చాటుతూ ముందుకు సాగుతోంది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్.

Also Read : వారెవ్వా జూనియ‌ర్ రొనాల్డో సూప‌ర్

Leave A Reply

Your Email Id will not be published!