Ajinkya Rahane : మరోసారి మెరిసిన అజింక్యా రహానే
ఆర్సీబీ బౌలర్లకు బ్యాటర్ చుక్కలు
Ajinkya Rahane : ఈసారి ఐపీఎల్ 16వ సీజన్ లో ఎవరూ ఊహించని విధంగా అజింక్యా రహానే(Ajinkya Rahane) తన ఆట తీరుకు భిన్నంగా ఆడుతున్నాడు. యువ క్రికెటర్లతో పోటీ పడుతున్నాడు. క్లాసిక్ ఇన్నింగ్స్ కు పేరొందిన ఈ బ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. అసలు మనం చూసిన రహానేనా అన్న అనుమానం కలుగుతోంది చూసే వాళ్లకు.
ఎప్పుడూ క్లాసిక్ షాట్స్ కు ప్రయారిటీ ఇచ్చే అజింక్యా రహానే ఉన్నట్టుండి గేర్ మార్చాడు. టెస్ట్ క్రికెటర్ గా ముద్ర పడిన రహానే తనలో అత్యంత వేగంగా ఆడే స్కిల్ కూడా ఉందని నిరూపించాడు. ఈసారి ఐపీఎల్ సీజన్ లో బేస్ ధరకు దక్కించుకుంది చెన్నై సూపర్ కింగ్స్(CSK). ఆటగాళ్లలో ఎవరిని ఎలా వాడుకోవాలో , వారిని ఎలా ప్రోత్సహించాలో మహేంద్ర సింగ్ ధోనీకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు.
తాజాగా బెంగళూరు వేదికగా జరిగిన కీలక లీగ్ పోరులో మరోసారి మెరిశాడు. ఎక్కడా తగ్గలేదు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సున్నాకే వెనుదిరిగితే ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన రహానే సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ డెవాన్ కాన్వేతో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. 20 బంతులు ఎదుర్కొన్న రహానే 3 ఫోర్లు 2 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 226 పరుగులు చేసింది.
Also Read : శివమెత్తిన శివమ్ దూబే