Ajinkya Rahane : భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ గా పేరొందిన అజింక్యా రహానే సంచలన కామెంట్స్ చేశాడు. సామాన్యంగా ఎవరి జోలికి వెళ్లకుండా తన పనేదో తాను చేసుకుంటూ పోయే రకం.
ఒకరకంగా మిస్టర్ కూల్ అన్న పదం అతడికి సరి పోతుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ జట్టును నడిపించడంలో సక్సెస్ అయ్యాడు.
కోహ్లీ అనుకోకుండా తప్పు కోవడంతో కెప్టెన్ గా వ్యవహరించిన అజింక్యా రహానే ఆస్ట్రేలియా సీరీస్ లో ఆ జట్టునే మట్టి కరిపించి ఇండియాకు విజయాన్ని అందించాడు.
ఆనాడు దేశం యావత్తు ఈ భారతీయ క్రికెటర్ కు భారీగానే స్వాగతం పలికింది. కానీ సక్సెస్ తాము కలిసి సాధిస్తే ఇంకొకరు క్రెడిట్ తీసుకున్నారంటూ పరోక్షంగా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిపై సీరియస్ కామెంట్స్ చేశాడు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం తాను ఫామ్ కోల్పోయి పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. రంజీ ట్రోఫీలో కూడా ఆడనున్నాడు రహానే. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ బోరియా మజుందార్ అజింక్యా రహానేతో(Ajinkya Rahane )మాట్లాడాడు.
ఈ సందర్భంగా ఆసిస్ విజయంలో ఎవరు కీలక పాత్ర పోషించారన్న ప్రశ్నకు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు రహానే. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో కష్టపడి భారత్ ను గెలిపిస్తే క్రిడిట్ ఇంకొకరికి దక్కిందని ధ్వజమెత్తాడు.
తాను కీలక పాత్ర పోషించానని చెప్పాడు. కెప్టెన్ గా తాను స్వంత నిర్ణయాలు తీసుకున్నానని స్పష్టం చేశాడు. ఆన్ ఫీల్డ్ లో జరిగిన వాటిని తామే చెప్పినట్లు రవిశాస్త్రి ఓన్ చేసుకున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు అజింక్యా రహానే.
తన పనై పోయిందంటూ వస్తున్న కామెంట్స్ ను తేలిగ్గా తీసుకున్నాడు. క్రికెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్లు ఇలా మాట్లాడరని చెప్పాడు.
Also Read : తిప్పేసిన ‘ప్రసిద్ద’ తలవంచిన విండీస్