Ajinkya Rahane : లీస్ట‌ర్ షైర్ క్ల‌బ్ తో ర‌హానే ఒప్పందం

ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ఆడాక

Ajinkya Rahane : ఫామ్ కోల్పోయి జ‌ట్టులో స్థానం కోల్పోయిన ప్ర‌ముఖ క్రికెట‌ర్ అజింక్యా ర‌హానే(Ajinkya Rahane) ఇంగ్లండ్ లోని లీస్ట‌ర్ షైర్ క్ల‌బ్ తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ విష‌యాన్ని క్రికెట్ క్ల‌బ్ ప్ర‌క‌టించింది. జూన్ నుండి లీసెస్ట‌ర్ షైర్ త‌ర‌పున ఆడ‌నున్నాడు. ఎనిమిది కౌంటీ ఛాంపియ‌న్ షిప్ మ్యాచ్ లు, వ‌న్డే క‌ప్ మొత్తం కాలాన్ని ఆడ‌తాడు. అన్ని ఫార్మాట్ ల‌లో త‌న దేశానికి నాయ‌క‌త్వం వ‌హించారు అజింక్యా ర‌హానే.

అంత‌ర్జాతీయ స్థాయిలో 8,000 కంటే ఎక్కువ ప‌రుగులు చేశాడు. టెస్టు క్రికెట్ లో 12 సంద‌ర్భాల‌లో , వ‌న్డే క్రికెట్ లో మూడు సార్లు, మూడు అంకెల‌ను చేరుకున్నాడు. అజింక్యా ర‌హానే లీసెస్ట‌ర్ షైర్ కు 2023లో తాజా సంత‌కం చేశాడు. వ‌రుస‌గా మూడోసారి సంత‌కం చేసిన న‌వీన్ ఉల్ హ‌క్ తో చేరాడు.

ఏప్రిల్ , మే నెల‌ల్లో ర‌హానే గైర్హాజ‌రీలో కౌంటీ ఛాంపియ‌న్ షిప్ లో పాల్గొంటాడు. రాబోయే సీజ‌న్ లో లీసెస్ట‌ర్ షైర్ లో చేరినందుకు సంతోషంగా ఉంద‌న్నాడు అజింక్యా ర‌హానే(Ajinkya Rahane). లీసెస్ట‌ర్ షైర్ కు అజింక్యాను స్వాగ‌తించేందుకు చాలా సంతోషిస్తున్నా. అద్భుత‌మైన ఆట‌గాడే కాదు అంత‌కంటే ఎక్కువ అనువం క‌లిగి ఉన్నాడ‌ని, అత‌డిని ఉప‌యోగించు కునేందుకు ఇది గొప్ప అవ‌కాశం లీసెష్ట‌ర్ షైర్ క్ల‌బ్ డైరెక్ట‌ర్ క్లాడ్ హెండ‌ర్స‌న్ స్ప‌ష్టం చేశారు.

2011 లో ఇంగ్లండ్ పై అరంగేట్రం చేసిన త‌ర్వాత 2016లో కీవీస్ పై 188 ప‌రుగులు చేశాడు. 38.52 స‌గ‌టుతో 4,931 ప‌రుగులు చేశాడు. వ‌న్డేల‌లో 90 మ్యాచ్ ల‌లో 35.26 స‌గ‌టుతో 2,962 ర‌న్స్ చేశాడు. ప్ర‌తి ఇన్నింగ్స్ లో సెంచ‌రీ చేసిన ఆరుగురు భార‌తీయుల‌లో ర‌హానే ఒక‌డిగా నిలిచాడు. అత్య‌ధిక క్యాచ్ లు ప‌ట్టిన వ్య‌క్తిగా కూడా రికార్డు నెల‌కొల్పాడు. 51 సెంచ‌రీలు చేశాడు.

Also Read : షాహీన్ అఫ్రిది ముందు బుమ్రా ఎంత

Leave A Reply

Your Email Id will not be published!