Ajit Agarkar : బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా అగార్కర్
వర్చువల్ గా ఇంటర్వ్యూగా హాజరు
Ajit Agarkar: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్ గా మాజీ భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ నియామకం దాదాపు ఖరారైనట్లే. అశోక్ మల్హోత్రా నేతృత్వంలో నిర్వహించిన ఇంటర్వ్యూకు వర్చువల్ గా హాజరయ్యాడు అగార్కర్. దీంతో బీసీసీఐ అతడికి చీఫ్ సెలెక్టర్ గా కాకుండా చైర్మన్ గా కొత్తగా మార్చినట్లు సమాచారం. క్రికెట్ అడ్వైజరీ కమిటీ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
దీంతో అజిత్ అగార్కర్(Ajit Agarkar) సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా నియామకం కేవలం లాంఛన ప్రాయమేనని తేలి పోయింది. ఇక ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత విండీస్ లో పర్యటించే ఐదు మ్యాచ్ లు ఆడే టీ20 టీమ్ ను ఎంపిక చేసే ఎంపిక కమిటీ మీటింగ్ కు అధ్యక్షత వహించనున్నారు.
క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) నిర్వహించిన ఇంటర్వ్యూకు కేవలం ఒకే ఒక్కరు హాజరయ్యారు. హాజరైంది ఎవరో కాదు అగార్కర్ ఒక్కడే. అయితే అజిత్ అగార్కర్ తన కుటుంబంతో విదేశాలలో ఉన్నారు. దీంతో వర్చువల్ గా ఇంటర్వ్యూకు హాజరైనట్లు బీసీసీఐ వెల్లడించింది. మరో వైపు ఐదు జోన్ల నుంచి ఒక్కో సెలెక్టర్ ను నియమించాలనే పాత పద్ధతికి గుడ్ బై చెప్పనున్నట్లు టాక్.
ఇక అజిత్ అగార్కర్ విషయానికి వస్తే తన కెరీర్ లో 26 టెస్టులు, 4 టీ20లు, 191 వన్డే మ్యాచ్ లు ఆడాడు. 1999, 2003, 2007 వరల్డ్ కప్ లలో భాగస్వామిగా ఉన్నాడు.
Also Read : Appalayagunta : 6న అప్పలాయగుంటలో పుష్ప యాగం
