Ajit Pawar : నవంబర్ 20న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి 175 సీట్లు సాధిస్తుంది

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎవరో ఒకరి సహాయం తీసుకోక తప్పదని అన్నారు...

Ajit Pawar : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ‘మహాయుతి’ కూటమి గెలుపు తథ్యమని, మూడు పార్టీలు కనీస ఉమ్మడి కార్యక్రమంతో రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తాయని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar) చెప్పారు. నవంబర్ 20న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి 175 సీట్లు గెలుచుకుంటుందని శనివారంనాడిక్కడ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. బారామతి నియోజకవర్గం నుంచి తాను కనీసం లక్ష ఓట్ల అధిక్యంతో గెలుస్తానని ఎన్‌సీపీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు.

Ajit Pawar Comment

ఉత్తరాదిరాజకీయాలు, దక్షిణాది రాజకీయాలు భిన్నంగా ఉంటాయని, మహారాష్ట్ర ఎన్నికలు పూర్తిగా భిన్నమైనవని అజిత్(Ajit Pawar) చెప్పారు. 1985 నుంచి మహారాష్ట్రలో ఓ ఒక్క పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించలేదని, ఈసారి కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎవరో ఒకరి సహాయం తీసుకోక తప్పదని అన్నారు. నవాబ్ మాలిక్‌కు టిక్కెట్‌పై అడిగినప్పుడు, అది తన ఒక్కడి నిర్ణయం కాదని, కూటమి కలిసికట్టుగా టిక్కెట్లు ఇచ్చిందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో 400 ప్లస్ సీట్లపై ఇచ్చిన నినాదంపై ‘మహా వికాస్ అఘాడి’ తప్పుడు ప్రచారం చేసిందని, ఇదే జరిగితే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు ఆపేస్తారని, దేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తారని తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసిందని తప్పుపట్టారు. ఇలాంటివేవీ ఈ దేశంలో జరిగే ప్రసక్తే లేదన్నారు.

పవార్కుటుంబంలో చిచ్చుపై మాట్లాడుతూ, ప్రభుత్వంలోకి వెళ్తామని ఎన్నోసార్లు శరద్ పవార్‌తో తమ ఎమ్మెల్యేలు చెప్పారని, ఆ సమయంలో ఆయన తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించి మళ్లీ వెనక్కి తీసుకున్నారని చెప్పారు. శరద్ పవార్ మనసులో ఏముందో ఎవరూ చెప్పలేరని, చివరకు సుప్రియా సూలే కూడా చెప్పలేరని అన్నారు. తాను వంచకుడినికాదని, తాను పార్టీలోనే ఉన్నానని, పార్టీ గుర్తు కూడా తనతోనే ఉందని, అసెంబ్లీ స్పీకర్ తమకు గుర్తు కేటాయించారని, ప్రస్తుతం ఇది సుప్రీంకోర్టు ముందు ఉందని అజిత్ పవార్ వివరణ ఇచ్చారు.

Also Read : Btech Ravi : భూకబ్జాలపై భగ్గుమన్న పులివెందుల టీడీపీ ఇంచార్జ్ ‘బీటెక్ రవి’

Leave A Reply

Your Email Id will not be published!